Johnny Wactor: అమెరికాలో మళ్లీ దుండగులు రెచ్చిపోయారు. ప్రముఖ హాలీవుడ్ నటుడు జానీ వాక్టర్ (37)ను కాల్చి చంపారు. అతడు కారులో ప్రయాణిస్తుండగా దొంగలు అతనిని దోచుకోవడానికి ప్రయత్నించిన సమయంలో కాల్పులు జరపడంతో జానీ వాక్టర్ మరణించాడు. వాక్టర్ తల్లి స్కార్లెట్, పోలీసులు శనివారం తెల్లవారుజామున 3:00 గంటలకు లాస్ ఏంజెల్స్ డౌన్‌టౌన్‌లో ప్రమాదం జరిగిందని చెప్పారు. ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు వాక్టర్ కారులోని ఉత్ప్రేరక కన్వర్టర్‌ను దొంగిలించే పనిలో ఉండగా, అడ్డుకోబోయిన అతడిపై దుండగులు కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన వాక్టర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు స్కార్లెట్ వెల్లడించింది. ఈ ఘటన జరిగిన వెంటనే నిందితులు అక్కడి నుంచి పారిపోగా, పోలీసులు వారి కోసం గాలిస్తున్నారు. ఇప్పటి వరకు ఎవరినీ అరెస్టు చేయలేదని పోలీసులు తెలిపారు.
Read Also:Konathala Ramakrishna: పవన్ కళ్యాణ్ ఆశించిన ఫలితం రాబోతుంది.. ఎన్డీయే కూటమిదే గెలుపు..!
జానీ వాక్టర్ 2007లో వచ్చిన లైఫ్‌టైమ్ డ్రామా సిరీస్ ‘ఆర్మీ వైవ్స్’ అనే టీవీ షోతో తన కెరీర్‌ను ప్రారంభించాడు. ఈ క్రమంలో అతను ‘వెస్ట్‌వరల్డ్’, ‘ది ఓ’, ‘స్టేషన్ 19’, ‘క్రిమినల్ మైండ్స్’, ‘హాలీవుడ్ గర్ల్’ వంటి అనేక విజయవంతమైన వెబ్ సిరీస్‌లు, టీవీ షోలలో నటించాడు. ముఖ్యంగా ‘జనరల్ హాస్పిటల్’ అనే షో జానీ వాకర్‌కి భారీ క్రేజ్ తెచ్చిపెట్టింది. 1963లో ప్రారంభమైన ఈ షోలో 2020 నుంచి 2022 వరకు దాదాపు 200 ఎపిసోడ్‌లలో నటించాడు. అతను పోషించిన బ్రాండో కార్బిన్ పాత్ర ఇప్పటికీ చాలా మందికి ఇష్టమైనది. ఇదిలా ఉండగా, జానీ వాకర్ మరణ వార్త విని తోటి నటీనటులు, జనరల్ హాస్పిటల్ షో టీమ్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వాక్టర్‌తో తమ అనుభవాలను పంచుకున్నారు.
Read Also:Karnataka : పోలీసులపై కోపంతో స్టేషన్ పై గ్రామస్తుల దాడి.. 25 మంది అరెస్ట్