Genelia: ఒకప్పుడు తెలుగులో టాప్ హీరోయిన్లలో ఒకరుగా రాణించిన జెనీలియా రితీశ్ దేశ్ ముఖ్ తో పెళ్ళి తర్వాత పూర్తిగా నటనకు దూరమయ్యారు. ఇటీవల కాలంలో జెనీలియా రీ ఎంట్రీ పై పలు వార్తలు వచ్చినా అవేవి నిజం కాలేదు. అయతే ఇప్పుడు జెనీలియా తన ఎంట్రీని భర్త రితీశ్ దేశ్ ముఖ్ దర్శకత్వంలోనే ఇవ్వనుంది. రితీశ్ కి ఇది దర్శకుడుగా తొలి చిత్రం. ఆ సినిమానే ‘వేడ్’. మరాఠీలో రూపొందిన ఈ సినిమా షూటింగ్ పూర్తయి విడుదలకు సిద్ధం అయింది. ఈ విషయాన్ని జెనీలియా సోషల్ మీడియాలో తెలియచేస్తూ ‘వేడ్’ రిలీజ్ డేట్ ను ప్రకటించారు. అలాగే సినిమాలో తన ఫస్ట్‌లుక్‌ను కూడా విడుదల చేసింది. ఇక సినిమా డిసెంబర్ 30న విడుదల కానున్నట్లు ప్రకటించింది.
Allari Naresh: వాటి మీద నాకు ఇంట్రెస్ట్ లేదు.. నేను దానికి పనికిరాను
ఇక ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తూ, ‘నేను మహారాష్ట్రలో పుట్టాను. నటిగా హిందీ, తమిళ, తెలుగు తదితర భాషల్లో సినిమాలు చేశాను. అక్కడి ప్రేక్షకుల నుంచి చక్కటి మద్దతు లభించింది. ఇప్పుడు రితీశ్ దేశ్‌ముఖ్ దర్శకత్వంలో మరాఠీ సినిమా ద్వారా రీఎంట్రీ ఇస్తున్నాను. ఇది నా తొలి మరాఠీ సినిమా. మీరు కూడా ఎంతగానో ఆదరిస్తారని అనుకుంటున్నాను. అందరికీ దీపావళి శుభాకాంక్షలు’ అని అన్నారు. ఇక మరాఠీ ‘వేడ్’ తో పాటు బాలీవుడ్ చిత్రం ‘మిస్టర్ మమ్మీ’లో కూడా జెనీలియా నటించనుంది. దీనికి టీసీరీస్ భూషణ్ కుమార్ నిర్మాత. ఇవి కాకుండా ఓ తెలుగు-కన్నడ బైలింగ్యువల్ సినిమాతో దక్షిణాదిన కూడా రీ ఎంట్రీ ఇవ్వటానికి సిద్ధం అవుతోంది జెనీలియా. మరి ఈ రీఎంట్రీలో జెనీలియా కెరీర్ ఎలా సాగుతుందో చూడాలి.