Gautam Gambhir Farewell Video to KKR: భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్‌గా నియమితుడైన టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్.. ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్, ఆ జట్టు అభిమానులకు భావోద్వేగ వీడ్కోలు నోట్‌ను పోస్ట్ చేశాడు. తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో పోస్ట్ చేసి.. ‘కోల్‌కతా నాతో రా.. కొత్త వారసత్వాలను సృష్టిద్దాం. బెంగాల్ క్రికెట్ అసోసియేషన్‌కు ప్రత్యేక ధన్యవాదాలు’ అని పేర్కొన్నాడు. వీడియోలో కోల్‌కతా నగరం, కేకేఆర్ జెండా, ఈడెన్ గార్డెన్స్ మైదానం, కేకేఆర్ అభిమానులను చూపిస్తూ.. తన అనుబంధాన్ని గుర్తు చేస్తుకున్నాడు. భారత జట్టు కోచ్‌గా నియమితుడవ్వడంతో కేకేఆర్ మోంటార్ బాధ్యతల నుంచి గౌతీ వైదొలిగాడు. ఈ నేపథ్యంలో ఎమోషనల్ గుడ్ బై చెప్పాడు.
వీడియో ఈడెన్ గార్డెన్స్‌లో మొదలవుతుంది. బ్యాక్‌గ్రౌండ్‌లో 2024 కేకేఆర్ తరఫున గౌతమ్ గంభీర్ జర్నీకి సంబంధించిన అంశాలను చూపించారు. స్రిప్ట్ దినేష్ చోప్రా రాయగా.. రితిక భట్టాచార్య ఎడిటర్‌గా వ్యవహరించారు. వీడియోకు కేకేఆర్ టీమ్, షారూక్ ఖాన్, భారత క్రికెట్ జట్టు అకౌంట్లను గౌతీ ట్యాగ్ చేశాడు. ‘మీరు నవ్వితే నేను నవ్వుతాను.. మీరు ఏడిస్తే నేను ఏడుస్తాను.. మీరు ఓడితే నేను ఓడిపోతాను.. మీరు కల కంటే నేను కల కంటాను.. మీరు సాధిస్తే నేను సాధిస్తాను. నేను మిమ్మల్ని నమ్ముతాను. కోల్‌కతా.. నేను మీలో ఒకడిని. మీ కష్టాలు నాకు తెలుసు, ఎక్కడ బాధ కలుగుతుందో తెలుసు. తిరస్కరణలు నన్ను బాధించాయి కానీ నేను మీలాగే నమ్మకంతో పైకి లేచాను. నేను ప్రతిరోజు ఓడిపోతాను కానీ మీలాగే ఓటమిని అంగీకరించను. పాపులర్ కావాలని అంటాను కానీ నేను విన్నర్‌గా ఉండాలని చెబుతా’ అని గంభీర్ పేర్కొన్నాడు.
Also Read: Gold Rate Today: నేడు తులంపై రూ.980 పెరిగింది.. 75 వేల మార్క్‌ను తాకిన బంగారం ధర!
‘కోల్‌కతా గాలి నాతో మాట్లాడుతోంది. ఇక్కడి శబ్దాలు, ట్రాఫిక్ జామ్ అన్నీ మీరు ఎలా ఫీలవుతున్నారో నాకు చెబుతాయి. మీరు ఎమోషనల్‌గా ఉన్నారని నాకు తెలుసు, నేను కూడా అలానే ఉన్నా. కోల్‌కతా.. మనది విడదీయలేని బంధం. మనది ఓ స్టోరీ, మనది ఓ టీమ్. ఇప్పుడు మనం కలిసి కొన్ని వారసత్వాలను సృష్టించుకోవాలి. మేం కొన్ని పెద్ద అధ్యాయాలను లిఖించే సమయం వచ్చింది. వాటిని లిఖించేది ఊదా సిరాతో కాదు.. నీలం రంగుతో’ అని గౌతమ్ గంభీర్ వీడియోలో చెప్పుకొచ్చాడు. కేకేఆర్‌కు కెప్టెన్‌గా 2012, 2014లో టైటిళ్లు అందించిన గౌతీ.. 2024లో మెంటార్‌గా ఛాంపియన్‌గా నిలిపాడు.