Ganja Gang: హైదరాబాద్ నగరంలోని బాలాపూర్ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతుంది. నిర్మానుష్య ప్రాంతాలు, శివార్లలో పోలీసుల నిఘా ఉండకపోవడంతో యువకులు రెచ్చిపోతున్నారు. కాగా.. విచ్చలవిడిగా లభిస్తున్న డ్రగ్స్, గంజాయి వంటి మత్తుపదార్థాలు మనుషుల ప్రాణాలు తీస్తున్నాయి. డ్రగ్స్ సేవించి మత్తులో ఏం చేస్తున్నారో తెలియక యువత నేరాలబాట పడుతున్నారు. ఇలా గంజాయి మత్తులో కొందరు యువకుల మధ్య జరిగిన గొడవలో ప్రశ్నించిన వారిపై దాడికి దిగుతున్నారు. ఇద్దరు యువకులపై గంజాయి గ్యాంగ్ కత్తులతో దాడి చేసిన ఘటన బాలాపూర్ పోలిస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
Read also: CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్!
మగ్ బుల్, శఫీ అనే ఇద్దరు యువకులు ఫుట్ బాల్ అడి వస్తుండగా రాయల్ కాలనీ వద్ద కొంతమంది యువకులు గాంజా మత్తులో వున్నారు. అది గమనించిన మగ్ బుల్, శఫీ అక్కడి నుంచి నడుచుకుంటూ త్వరగా వెళుతుండం గమనించిన గంజా గ్యాంగ్ ఇద్దరి యువకును చుట్టుముట్టారు. మాటలతో వేధించడం మొదలు పెట్టారు. అయితే వారి నుంచి తప్పించుకునేందుకు ఎంత ప్రయత్నించిన మగ్ బుల్, శఫీపై గంజా గ్యాంగ్ కత్తులతో దాడి చేశారు. విచక్షణా రహితంగా కత్తులతో ఆ యువకులపై దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. గాయాలైన ఇద్దరి యువకులను స్థానికులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న బాలాపూర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని, దాడి చేసిన యువకులు ఎవరు అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. నిత్యం ఇదే ప్రాంతంలో గంజాయి సేవించి కొంతమంది యువకులు వచ్చిపోయే వారిని భయబ్రాంతులకు గురిచేస్తున్నారని స్థానికుల ఆరోపిస్తున్నారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు బాలాపూర్ పోలీసులు.
J. P. Nadda: స్వాతి మలివాల్ అంశంలో ఆప్ ఆరోపణలపై జేపీ నడ్డా ఫైర్..