Ganja Gang Attack: రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలోని వనస్థలిపురం ప్రాంతంలో గంజాయి బ్యాచ్ ఆగడాలు అడ్డు అదుపు లేకుండా రెచ్చిపోతున్నాయి. వనస్థలిపురం పరిధిలోని జెమ్ కిడ్నీ హాస్పిటల్ ముందు చోటుచేసుకున్న ఒక దారుణ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. గురువారం రాత్రి సుమారు 9 గంటల సమయంలో ఆరుగురు యువకులు హాస్పిటల్ ముందు మద్యం తాగుతూ న్యూసెన్స్ సృష్టించారు. హాస్పిటల్ ముందు మద్యం సేవించవద్దని హాస్పిటల్ సిబ్బంది అభ్యర్థించడంతో, ఆ యువకులు వారిపై దాడికి పాల్పడ్డారు.…
ఏపీ మీదుగా తెలంగాణకు వస్తున్న గంజాయి అక్రమ రవాణాపై హైదరాబాద్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై గంజాయి సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. చిట్యాల వద్ద పోలీసుల వాహన తనిఖీలు నిర్వహించారు. భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఓ ట్రాలీలో 100 కిలోల గంజాయి రవాణా చేస్తుండగా దానిని సీజ్ చేశారు. ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఏవోబీ ప్రాంతం నుంచి హైదరాబాద్ కు గంజాయి రవాణా చేస్తోంది ముఠా. ఎస్పీ…