కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను మంత్రి గంగుల కమలాకర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బడుగు బలహీన వర్గాల కుటుంబాల ఆడపడుచుల పెళ్లిల కోసం దేశంలోనే అద్భుతమైన కల్యాణ లక్ష్మి స్కీం అని ఆయన కొనియాడారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ స్కీం ద్వారా లక్ష రూపాయలను సీఎం కేసీఆర్ ఇవ్వాలంటూ తనను దూతగా పంపారని మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. దేశంలోనే ఏ ముఖ్యమంత్రి ప్రవేశపెట్టని కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పెళ్లి కొరకు లక్ష రూపాయల చేయూత స్కీమును ప్రవేశపెట్టిన ఘనత సీఎం కేసీఆర్ దే అని ఆయన అన్నారు. ప్రపంచంలోనే అత్యంత ఆర్థిక సంక్షోభం ఎదుర్కొనే కరోనా టైంలో కూడా ఆడబిడ్డ పెళ్లిళ్లు ఆగకుండా జరగాలని ఈ స్కీములు కొనసాగించడం సీ ఎం కేసీఆర్ సాహసమని ఆయన అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి ప్రతి ఒక్క స్కీములను ప్రజలు గుర్తించి సీఎం కేసీఆర్‌కు దీవెనలు అందించాలని మంత్రి గంగుల కమలాకర్ విజ్ఞప్తి చేశారు.
Also Read : Harsh Goenka: ఇస్రో ఛైర్మన్ జీతం ఎంతో తెలుసా..? అసలు విషయం బయటపెట్టిన ప్రముఖ పారిశ్రామికవేత్త
అనంతరం మెడికల్ కళాశాల ప్రారంభోత్సవానికి సంబంధించి అధికారులతో కలిసి కలెక్టరేట్ సమీక్ష నిర్వహించారు. అలాగే రేకుర్తిలోని బస్తీ దవాఖానలో ఆరోగ్య మహిళ కేంద్రాన్ని ప్రారంభించారు. సాయంత్రం మెడికల్ కళాశాలలో సాగుతున్న వివిధ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎన్నికల వేళ కాంగ్రెస్, బీజేపీ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వారి మాటలు నమ్మి అధికారం అందిస్తే తెలంగాణలోని సంపదను దోచుకుని తెలంగాణను గుడ్డిదీపం చేస్తారని విమర్శించారు. బీజేపీ,కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఇప్పటికీ తాగునీరు, కరెంట్ కోసం కష్టాలు పడుతున్నారని పేర్కొన్నారు. కానీ తెలంగాణలో మాత్రం ప్రతి ఇంటికి తాగునీరు అందించడంతో పాటుగా, 24 గంటలు నాణ్యమైన కరెంటును అందిస్తున్నామని పేర్కొన్నారు.
Also Read : Satyender Jain: సత్యేందర్ జైన్ బెయిల్ ఈనెల 25వరకు పొడిగింపు