Gangula Kamalakar : జూన్ 10వ తేదీ చరిత్రలో నిలిచిపోతుంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాళేశ్వరం ప్రాజెక్టు… 24 గంటల కరెంటుతో అధిక దిగుబడి వచ్చిందన్నారు మంత్రి గంగుల కమలాకర్. ఇవాళ ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జూన్ 10వ తేదీ చరిత్రలోనే నిలిచిపోతుందన్నారు. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా జూన్ 10వ తేదీ నాటికి 62 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని, 2022 జూన్ 10వ తేదీ నాటికి కేవలం 14 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామన్నారు. ఇప్పటివరకు 9 లక్షల 50వేల మంది రైతులు తమ ధాన్యాన్ని అమ్ముకున్నారని, 12,450 కోట్ల విలువ చేసే ధాన్యాన్ని కొనుగోలు చేశామన్నారు మంత్రి గంగుల.
Mahesh Kumar Goud : ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలి
Also Read
అంతేకాకుండా.. ‘తొలుత తెలంగాణ వ్యాప్తంగా 7,192 ధాన్యం కేంద్రాలను ప్రారంభిస్తామని ప్రణాళికలు సిద్ధం చేసినప్పటికీ… 7,034 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశాం. గతంలో 4,135 కేంద్రాలు మాత్రమే ఉండేవి. ఇప్పటివరకు 6వేల కోట్ల రూపాయలను రైతుల ఖాతాలో జమ చేశాం. మిగతా డబ్బులను సైతం జూన్ 15లోగా రైతుల ఖాతాల్లో జమ చేస్తాం. రెండవ పంటను కొనుగోలు చేసి ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే. రకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకున్నాం. జూన్ 16వ తేదీ వరకు కొనుగోలు కేంద్రాలను క్లోస్ చేస్తాం. ఆలస్యంగా ప్రారంభమైన ధాన్యం కొనుగోలు కేంద్రాలకు అనుమతిని ఇస్తాం. కొన్ని ప్రాంతాల్లో కొనుగోలు పూర్తయిన కేంద్రాల్లో కొంతమంది రాజకీయాలు చేస్తున్నారు. స్వయంపాలనలో కరీంనగర్ గొప్ప నగరంగా అవతరించింది… అభివృద్ధి మీ కళ్ళకే కనిపిస్తుంది. ఇప్పుడు సుందరంగా తీర్చిదిద్దాం. సివిల్ ఇంజనీర్గా ఎమ్మెల్యేగా కరీంనగర్ ప్రజలకు గొప్ప నగరాన్ని అందించాలని కృషి చేస్తున్నాను. కరీంనగరం బ్రహ్మోత్సవాలు కలోత్సవాలు చిత్రోత్సవాలకు వేదికగా మారింది.
సౌత్ ఇండియాలోనే తొలి కేబుల్ బ్రిడ్జిని ఈనెల 21వ తేదీన మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభించుకుంటున్నాం. ఈ కేబుల్ బ్రిడ్జి దుర్గం చెరువు కన్నా అడ్వాన్సుగా ఉంటుంది. కేబుల్ బ్రిడ్జిలో 10/30 అడుగుల స్క్రీన్లు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. అదేరోజు సెంట్రల్ లైటింగ్ అని కూడా ప్రారంభించుకుంటాం. 21వ తేదీన కేబుల్ బ్రిడ్జితో పాటు పబ్లిక్ అడ్రసింగ్ సిస్టం… ట్రాఫిక్ సిగ్నల్స్.. ఫ్రీ వైఫై ని మంత్రి కేటీఆర్ ప్రారంభిస్తారు. సాయంత్రం ఏడు గంటలకు లైటింగ్ సిస్టం క్రాకర్షూ లేజర్ షో బహిరంగ సభ నిర్వహిస్తాం. ప్రతీ ఆదివారం సాయంత్రం 6 గంటల నుండి 11 గంటల వరకు బ్రిడ్జి పైకి వాహనాలను అనుమతించం. ఊహకు అందని విధంగా ఎంఆర్ఎఫ్ ను నిర్మిస్తున్నాం. ఆగస్టు 15వ తేదీన మొదటి దశ ఎంఆర్ఎఫ్ ను ప్రారంభిస్తున్నాం. అదేరోజు ప్రపంచంలోనే మూడవదైన అతి పెద్ద ఫౌంటెన్ ప్రారంభిస్తాం. 72 కోట్లతో నిర్మించనున్న ఈ ఫౌంటెన్ టెండర్లు పూర్తయి పనులు ప్రారంభమయ్యే దశలో ఉన్నాయి. ఓటు వేసి గెలిపించిన ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా మంచి పరిపాలన అందించేందుకు కృషి చేస్తున్నాం. రాజకీయ విమర్శలు పట్టించుకోము… దీవెనార్థులు అనుకుంటాం.’ అని ఆయన వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Gut Health: జీర్ణక్రియ మెరుగుపడాలంటే..? రోజువారీ ఆహారంలో ఈ ఐదు చేర్చండి
-
OTR: యాక్టివ్ మోడ్‌లోకి షకీల్.. కవిత ఎఫెక్ట్, కేటిఆర్ వార్నింగ్ కారణమా ?
-
OTR: కొండా సురేఖ బీజేపీలో చేరుతుందా ?
-
West Bengal: ‘‘అమ్మాయిలు 3 నెలల స్కర్టులు ధరించొద్దు’’.. బెంగాల్ మంత్రి ఎందుకు ఇలా చెప్పారు.?
-
Dancers Union Clash: పోలీసుల వద్దకి సినీ డాన్సర్స్ యూనియన్ పంచాయతీ!
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!