భారత్, ఇంగ్లాండ్ మధ్య జరగనున్న రెండో టెస్ట్ మ్యాచ్ కు సన్నాహాలు ముమ్మరం అయ్యాయి. ఈ ఉత్కంఠభరితమైన మ్యాచ్ జూలై 2 నుంచి 6 వరకు బర్మింగ్ హామ్ లోని ఎడ్జ్ బాస్టన్ క్రికెట్ గ్రౌండ్ లో జరుగుతుంది. సిరీస్ లోని మొదటి మ్యాచ్ లో ఓటమి పాలైన టీమిండియా తిరిగి పుంజుకోవాలని చూస్తోంది. దీని కోసం టీమిండియా ఆటగాళ్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రాక్టీస్ సెషన్‌లో, బ్యాట్స్‌మెన్ వారి టెక్నిక్‌ను, బౌలర్లు వారి లైన్-లెంగ్త్‌ను మెరుగుపరచుకోవడంలో బిజీగా…
టీమిండియా ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగడంపై పాకిస్తాన్ బౌలింగ్ కోచ్ అకిబ్ జావేద్ స్పందించారు. ఈ సందర్భంగా భారత్ స్పిన్ దాడి గురించి తమ జట్టు ఎలాంటి ఆందోళన చెందడం లేదని అన్నారు. తమ జట్టులో స్పిన్నర్లు లేకపోవడం వల్ల ఎటువంటి ప్రతికూలత లేదన్నారు.
టీమిండియా బౌలింగ్ కోచ్గా సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ మోర్నీ మోర్కెల్ సెలక్ట్ అయినట్లు క్రిక్ బజ్ (Cricbuzz) తెలిపింది. ఆయన నియామకంపై త్వరలోనే బీసీసీఐ అధికారిక ప్రకటన చేయనుంది. టీమిండియా హెడ్ కోచ్ గౌతం గంభీర్ రికమెండ్ చేయడంతో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మోర్కెల్ సెప్టెంబర్ 1 నుంచి బౌలింగ్ కోచ్గా బాధ్యతలు తీసుకోనున్నట్లు సమాచారం.
2023 వన్డే ప్రపంచకప్‌లో మూడింటిలో మూడు గెలిచి మంచి ఫాంలో ఉన్న టీమిండియా.. రేపు బంగ్లాదేశ్ తో తలపడనుంది. పుణే వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది. అయితే మ్యాచ్‌కు ముందు టీమిండియా బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే విలేకరుల సమావేశంలో మాట్లాడాడు. బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబుల్ హసన్‌ను ఎదుర్కొనేందుకు ప్రత్యేకంగా ఎలాంటి ప్లాన్స్ లేవని మాంబ్రే స్పష్టం చేశాడు.
ఐపీఎల్ ముగిసిన వెంటనే టీమిండియా జూన్ 7 నుంచి 11 వరకూ ఇంగ్లాండ్‌లో ని ‘ది ఓవల్’ స్టేడియం వేదికగా జరుగబోయే ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియాతో భారత జట్టు తలపడనుంది.
టీమిండియా కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ అయితే బాగుంటుంది అనే చర్చ ఎప్పటి నుంచో జరుగుతోంది.. అందుకు ప్రధాన కారణం ఇండియా ఏ మరియు అండర్ 19 జట్లను ఆయన నడిపిస్తున్న తీరే కారణం.. ఇక, ఏ వివాదాల జోలికి పోని వ్యక్తి.. మరోవైపు, ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీతో మంచి సంబంధాలు కలిగిన వ్యక్తి కూడా.. అదే ఇప్పుడు మిస్టర్ డిపెండబుల్ ను టీమిండియా హెడ్ కోచ్ పదవికి చేరువ చేసింది.. త్వరలోనే ప్రస్తుత కోచ్…