Nadendla Manohar : ప్రభుత్వం ‘సూపర్ సిక్స్ హామీలు’ కింద అమలు చేస్తున్న ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ద్వారా ఇప్పటి వరకు 25,64,951 ఉచిత గ్యాస్ సిలిండర్లు లబ్దిదారులకు అందించినట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. అలాగే, మొత్తం రూ.141 కోట్లు 15 లక్షల 81 వేల నగదు లబ్దీదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయబడినట్లు వెల్లడించారు. ఈ పథకం కింద రాష్ట్రంలో 1.55 లక్షల ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్లు కల్పించబడినట్టు ఆయన చెప్పారు. ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్, రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించాలన్న లక్ష్యంతో ఈ పథకం అమలు చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.
Winter: శీతాకాలంలో క్యారెట్ జ్యూస్ తాగితే ఎన్ని లాభాలో..!
మరోవైపు, ‘దీపం-2’ పథకంపై శాసన మండలిలో శాసన సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఉచిత గ్యాస్ సిలిండర్ల సరఫరా పథకం అమలవుతున్నదని, సిలిండర్ డెలివరీ తరువాత మాత్రమే సబ్సిడీ అమలు చేస్తామన్నారు. ఈ పథకాన్ని 3 విడతలుగా బుకింగ్ చేసుకునే సౌకర్యం కూడా కల్పించామని ఆయన తెలిపారు. అయితే, వైఎస్సార్‌సీపీ నేతలు ఈ పథకంపై ప్రజల్లో అపోహలుమ సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని మంత్రి నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు.
అంతేకాకుండా.. ‘గ్యాస్ సిలిండర్ల పథకంపై వైఎస్సార్‌సీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రంలో కోటి 55 లక్షల ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. దేశంలో ఎక్కడా లేని విధంగా ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని అమలు చేస్తున్నాం. సిలిండర్ డెలివరీ అయ్యాకే సబ్సిడీ మొత్తం అందిస్తున్నాం. ఉచిత గ్యాస్ పథకం ప్రారంభించిన నాటి నుంచి ఇప్పటి వరకు 35 లక్షల 77 వేల 566 గ్యాస్ సిలిండర్లు బుకింగ్ అయ్యాయి. ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి 2700 కోట్లు ఏడాదికి ఖర్చవుతుందని అంచనా వేశాం. అందరికీ ఒకేసారి కోట్లలో గ్యాస్ సిలిండర్లను సరఫరా చేయలేమని గ్యాస్ కంపెనీలు చెప్పాయి. మూడు విడతల్లో ఉచిత గ్యాస్ సిలిండర్లను బుకింగ్ చేసుకునే సదుపాయం కల్పించాం.’ అని నాదెండ్ల మనోహర్ అన్నారు.
Pakistan: పాకిస్తాన్ ఎయిర్ లైనర్ PIAని కొనే దిక్కే లేదు..