Nadendla Manohar : ఇప్పటి వరకు 25,64,951 ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించాం
- ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ద్వారా ఇప్పటి వరకు 25,64,951 ఉచిత గ్యాస్ సిలిండర్లు లబ్దిదారులకు అందించాం
- మొత్తం రూ.141 కోట్లు 15 లక్షల 81 వేల నగదు లబ్దీదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశాం, ఈ పథకం కింద రాష్ట్రంలో 1.55 లక్షల ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్లు కల్పించబడ్డాయి : నాదెండ్ల మనోహర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nadendla Manohar : ప్రభుత్వం ‘సూపర్ సిక్స్ హామీలు’ కింద అమలు చేస్తున్న ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ద్వారా ఇప్పటి వరకు 25,64,951 ఉచిత గ్యాస్ సిలిండర్లు లబ్దిదారులకు అందించినట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. అలాగే, మొత్తం రూ.141 కోట్లు 15 లక్షల 81 వేల నగదు లబ్దీదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయబడినట్లు వెల్లడించారు. ఈ పథకం కింద రాష్ట్రంలో 1.55 లక్షల ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్లు కల్పించబడినట్టు ఆయన చెప్పారు. ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్, రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించాలన్న లక్ష్యంతో ఈ పథకం అమలు చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.
Winter: శీతాకాలంలో క్యారెట్ జ్యూస్ తాగితే ఎన్ని లాభాలో..!
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
మరోవైపు, ‘దీపం-2’ పథకంపై శాసన మండలిలో శాసన సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఉచిత గ్యాస్ సిలిండర్ల సరఫరా పథకం అమలవుతున్నదని, సిలిండర్ డెలివరీ తరువాత మాత్రమే సబ్సిడీ అమలు చేస్తామన్నారు. ఈ పథకాన్ని 3 విడతలుగా బుకింగ్ చేసుకునే సౌకర్యం కూడా కల్పించామని ఆయన తెలిపారు. అయితే, వైఎస్సార్‌సీపీ నేతలు ఈ పథకంపై ప్రజల్లో అపోహలుమ సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని మంత్రి నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు.
అంతేకాకుండా.. ‘గ్యాస్ సిలిండర్ల పథకంపై వైఎస్సార్‌సీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రంలో కోటి 55 లక్షల ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. దేశంలో ఎక్కడా లేని విధంగా ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని అమలు చేస్తున్నాం. సిలిండర్ డెలివరీ అయ్యాకే సబ్సిడీ మొత్తం అందిస్తున్నాం. ఉచిత గ్యాస్ పథకం ప్రారంభించిన నాటి నుంచి ఇప్పటి వరకు 35 లక్షల 77 వేల 566 గ్యాస్ సిలిండర్లు బుకింగ్ అయ్యాయి. ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి 2700 కోట్లు ఏడాదికి ఖర్చవుతుందని అంచనా వేశాం. అందరికీ ఒకేసారి కోట్లలో గ్యాస్ సిలిండర్లను సరఫరా చేయలేమని గ్యాస్ కంపెనీలు చెప్పాయి. మూడు విడతల్లో ఉచిత గ్యాస్ సిలిండర్లను బుకింగ్ చేసుకునే సదుపాయం కల్పించాం.’ అని నాదెండ్ల మనోహర్ అన్నారు.
తాజావార్తలు
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
-
OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..