Botsa Satyanarayana: కాకినాడ జిల్లాలోని పిఠాపురంలో వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ బొత్స సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సూపర్ సిక్స్ వాగ్దానాలు ఎందుకు అమలు చేయడం లేదని ఎన్డీయే కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలుపై ఏపీఎస్‌ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణ గుడ్ న్యూస్ చెప్పారు. కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్‌లో ఇచ్చిన హామీలు అన్ని ఒక్కొక్కటిగా అమలు పరుస్తోందని వెల్లడించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలును వీలైనంత త్వరలో ప్రారంభిస్తామని ఆయన చెప్పారు.
ప్రభుత్వం 'సూపర్ సిక్స్ హామీలు' కింద అమలు చేస్తున్న ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ద్వారా ఇప్పటి వరకు 25,64,951 ఉచిత గ్యాస్ సిలిండర్లు లబ్దిదారులకు అందించినట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.