Minister KTR : మూసి, ఈసా నదులపై ఫోర్ లైన్ బ్రిడ్జిలు.. రేపు శంకుస్థాపన చేయనున్న మంత్రి కేటీఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజధాని నగర పౌరులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న మూసి, ఈసా నదులపై వంతెనల (బ్రిడ్జిల) నిర్మాణపనులు త్వరలో సాకారం కానున్నాయి. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్)లోపల పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా ప్రజల మౌలిక అవసరాలకు సరిపడా ప్రజా రవాణా వ్యవస్థలో మున్సిపల్ పరిపాలన పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి కేటీ రామారావు సారథ్యంలో ఎంఏయుడి స్పెషల్ చీఫ్ సెక్రటరీ, హెచ్ఎండిఏ మెట్రోపాలిటన్ కమిషనర్ అర్వింద్ కుమార్ పర్యవేక్షణలో గణనీయమైన మార్పులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా మూసీనదిపైన, ఈసానదిపైన వంతెనల నిర్మాణానికి అవసరమైన చర్యలు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. మూసి, ఈసా నదులపై 14 బ్రిడ్జిలు(వంతెనలు) నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే కరోనా (కోవిడ్) వల్ల రెండు సంవత్సరాల పాటు ఎదురైన పరిస్థితుల కారణంగా మూసి, ఈసా నదులపై వంతెనల నిర్మాణ కార్యాచరణలో జాప్యం చోటుచేసుకుంది.
హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండిఏ) ఆధ్వర్యంలో మూసినదిపైన మూడు(3) చోట్ల, ఈసానదిపై రెండు(2) చోట్ల వంతెనల నిర్మాణ పనులకు ముందడుగు పడింది. సుమారు రూ.168 కోట్ల వ్యయంతో ఐదు(5) వంతెనల నిర్మాణ పనులకు హెచ్ఎండిఏ ఇప్పటికే ఇంజనీరింగ్ ప్రోక్యుర్మెంట్ అండ్ కన్ స్ట్రక్షన్ (ఈపీసీ) పద్ధతిలో టెండర్ల ప్రక్రియను పూర్తి చేసింది. హెచ్ఎండిఏ నిర్మించే ఐదు వంతెనలు.. రూ.42కోట్లతో ఉప్పల్ బాగాయత్ లే అవుట్ వద్ద కాగా.. రూ.35కోట్లతో ప్రతాపసింగారం- గౌరెల్లి వద్ద వద్ద, రూ.39కోట్లతో మంచిరేవుల వద్ద, రూ.32కోట్లతో బుద్వేల్ ఐటీ పార్క్-2 సమీపంలో ఈసా నదిపై, రూ.20కోట్లతో బుద్వేల్ ఐటీ పార్క్-1 సమీపంలో ఈసా నదిపై హెచ్ఎండిఏ వంతెనల నిర్మాణాలను చేపట్టనున్నది.
Also Read
- Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
- Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
- Rishabh Pant: మైదానంలోనే కాదు.. ఆర్థికంగానూ రికార్డు బద్దలు.. నంబర్-1 ట్యాక్స్ పేయర్‌గా రిషభ్ పంత్..
- Sonam Wangchuk: అర్ధరాత్రి వేళ మాట ఇచ్చి మోసం చేశారు.. కేంద్ర మంత్రుల తీరుపై సోనమ్ వాంగ్‌చుక్ ఆవేదన
ఉప్పల్ భగాయత్, ప్రతాపసింగారం ప్రాంతాల్లో సుమారు 210 మీటర్ల పొడవున మూసిపై నాలుగు వరుసల(ఫోర్ లైన్) వంతెన నిర్మాణం జరుగనున్నది. టెండర్ ప్రక్రియ ఇప్పటికే పూర్తి అయినందున మంత్రి కేటీ రామారావు గారు సోమవారం (25వ తేదీన) శంకుస్థాపన చేయనున్నారు. ఐదు వంతెన నిర్మాణ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. వంతెనల (బ్రిడ్జిల) నిర్మాణ పనులను 15 నెలల గడువులోగా పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దాదాపు ఏడాదిన్నర కాలంలో హెచ్ఎండిఏ అన్నివంతెనల నిర్మాణాలు పూర్తి చేసి ప్రజలకు, వాహనచోదకులకు అందుబాటలోకి తీసుకునిరావాలని ప్రభుత్వం ధృఢసంకల్పంతో ఉంది. మూసీ, ఈసా నదులపై వంతెనల నిర్మాణాలు పూర్తి అయిన తర్వాత ప్రయాణం మరింత సులభతరం అవుతుంది. ప్రయాణదూరం, సమయం గణనీయంగా తగ్గుతుంది.
తాజావార్తలు
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
-
CSK-IPL 2027: చెన్నై సూపర్ కింగ్స్‌కు మరో షాక్.. స్టార్ కోచ్ కూడా గుడ్‌బై.. సీఎస్కే భవిష్యత్‌పై బెంగ!
-
Kanika Kapoor: ఆమెలా ఉంటే తప్పేముంది.. సినిమాలో కనిపించేది నేనేగా.. కియారా పోలికలపై కనికా కపూర్ ముచ్చట
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
-
House Collapse: నిద్రలోనే తెల్లారిన బతుకులు.. 100 ఏళ్ల నాటి ఇల్లు కూలి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి
ట్రెండింగ్
-
8,000 నిట్స్ OLED డిస్‌ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్‌తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!
-
LDAC సపోర్ట్, 32.5 గంటల బ్యాటరీ, స్మార్ట్ డయల్‌తో CMF Clip Pro ఓపెన్-ఇయర్ ఇయర్‌బడ్స్ లాంచ్..!
-
Haryana: ఛీ.. ఛీ.. ఇంత దారుణమా? కూతుళ్ల కోసం జీవితాన్ని ధారబోసిన తండ్రి.. వీడియో కాల్లో అంత్యక్రియలు వీక్షించిన కూతుళ్లు!
-
144Hz డిస్‌ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!