హైదరాబాద్ నగరంలో జరిగిన ఫార్ములా ఈ కార్ రేస్‌లో అవకతవకలపై ఏసీబీ (అవినీతి నిరోధక శాఖ) విచారణ పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఈ రేస్‌లో అవినీతి జరిగిందని ఆరోపణలు రావడంతో ఏసీబీ గత తొమ్మిది నెలలుగా విచారణ జరిపింది.
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ లో మరో మృతదేహాన్ని గుర్తించారు. లోకో ట్రైన్ శిథిలాల కింద డెడ్ బాడీ గుర్తించిన రెస్క్యూ టీమ్స్ తవ్వకాలు చేపడుతోంది. బృందాలు శిథిలాలను గ్యాస్ కట్టర్ లతో కట్ చేస్తున్నాయి. ఒక కాలు కనిపించడం, దుర్వాసన రావడంతో తవ్వకాలు చేపడుతున్నారు. మధ్యాహ్నానికి మృతదేహాన్ని బయటకు తీసుకురానున్నారు.
SLBC టన్నెల్‌లో మృతదేహాలు గుర్తించడానికి కేరళ నుంచి క్యాడవర్ డాగ్స్ ను తీసుకొచ్చారు. రెండు ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్ లలో 2 డాగ్స్ ను తీసుకొచ్చారు. రెస్క్యూ టీమ్ డాగ్స్ ను టన్నెల్ లోకి తీసుకెళ్లాయి. ఐఐటీ నిపుణుల బృందంతో సింగరేణి, NDRF బృందాలు టన్నెల్‌లోకి వెళ్లాయి... డిజాస్టర్ మేనేజ్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్.. పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ సహాయక బృందాలకు దిశా నిర్దేశం చేస్తున్నారు.
Dharmapuri Arvind : హైదరాబాద్ మహానగరంలో అక్రమ నిర్మాణాల కూల్చివేతపై ప్రభుత్వాన్ని తీవ్రంగా ప్రశ్నించిన నిజామాబాద్ ఎంపీ డి. అర్వింద్ కుమార్, ఓల్డ్ సిటీలో కూడా ఇదే తీరుగా చర్యలు తీసుకోవాలా? అని సవాల్ విసిరారు. సీఎం రేవంత్ రెడ్డికి నిజమైన ధైర్యముంటే ఓల్డ్ సిటీలో అడుగుపెట్టగలరా? అంటూ ఆయన సూటిగా ప్రశ్నించారు. ఆదివారం నిజామాబాద్‌లో జరిగిన ఓ సమావేశంలో మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, హిందూ-ముస్లింలపై…
ఫార్ములా ఈ-రేస్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ నేడు ఏసీబీ విచారణకు హాజరుకానున్నారు. మరోవైపు.. రేపు ఈడీ విచారించనుంది. ఫార్ములా ఈ రేస్ కేసుల్లో ఈ రెండు సంస్థలు దర్యాప్తు ముమ్మరం చేశాయి.
KTR : ఫార్ములా ఈ-రేస్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌కు ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈనెల 6వ తేదీన ఉదయం 10 గంటలకు విచారణకు హాజరుకావాలని శుక్రవారం జారీ చేసిన నోటీసుల్లో పేర్కొనబడింది. కేటీఆర్‌తో పాటు, బీఎల్‌ఎన్ రెడ్డి, అర్వింద్ కుమార్‌లకు కూడా నోటీసులు జారీ అయ్యాయి. కేటీఆర్ విచారణ పూర్తయిన తర్వాత వారిని కూడా విచారించే అవకాశం ఉందని సమాచారం. HMPV Virus:…
ఫార్ములా ఈ కార్ రేసు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మరోసారి ఈడీ అధికారులను రావాలని కోరింది. ఈ క్రమంలో నోటీసులు జారీ చేశారు. 8, 9వ తేదీల్లో బీఎల్‌ఎన్‌రెడ్డి, అరవింద్‌కుమార్‌లు రావాలని ఈడీ నోటీసుల్లో పేర్కొంది.
గత ప్రభుత్వ హయాంలో ఈ-ఫార్ములా రేసు కోసం విదేశీ కంపెనీకి నిబంధనలతు విరుద్ధంగా నిధులు బదలాయించారన్న కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ-ఫార్ములా రేసు నిధుల బదలాయింపుపై విచారణకు గవర్నర్ ఆమోదం తెలిపారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం వెల్లడించింది. న్యాయనిపుణుల సలహాలు తీసుకుని గవర్నర్ ఆమోదం తెలిపారని.. సీఎస్ ద్వారా ఏసీబీకి లేఖ పంపుతామని ప్రభుత్వం పేర్కొంది.
Formula E Race: తెలంగాణ రాష్ట్రంలో భారత రాష్ట్ర సమితి ప్రభుత్వ హయాంలో అరవింద్ కుమార్ మున్సిపల్ శాఖతో పాటు పలు కీలక శాఖల్లో పనిచేశారు. ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అరవింద్ కుమార్...