Former Pope Benedict XVI Died: మాజీ పోప్ బెనెడిక్ట్ కన్నుమూశారు. ఆయనకు 95 ఏళ్లు. వయోభారంతో బాధపడుతూ వాటికన్‌లోని మాథర్ ఎక్లేసియా ఆశ్రమంలో మరణించారు. అనారోగ్య కారణాలతో 2013లో పోప్ పదవికి రాజీనామా చేశారు. వయసు సంబంధ ఆరోగ్య సమస్యలతో ఇటీవల బెనెడిక్ట్ ఆస్పత్రిలో చేరారు. బెనెడిక్ట్ తొమ్మిదేళ్ల క్రితం చర్చి అత్యున్నత పదవికి రాజీనామా చేశారు. బెనెడిక్ట్ తన చివరి సంవత్సరాలను వాటికన్ సిటీలోని మాథర్ ఎక్లేసియా ఆశ్రమంలో గడిపాడు. బెనెడిక్ట్ పరిస్థితి విషమంగా ఉందని, వృద్ధాప్య సంబంధ వ్యాధులతో ఇబ్బంది పడుతున్నాడని వాటికన్ ప్రతినిధి ఒకరు తెలిపారు. ‘రెండు వేల సంవత్సరాల వాటికన్ చర్చి చరిత్రలో బెనెడిక్ట్ పదవీకాలం అనేక వివాదాలతో చుట్టుముట్టింది.
Read Also: New Covid Variant: భారత్లోకి కొత్త కోవిడ్ వేరియంట్.. గుజరాత్లో మొదటికేసు
క్రైస్తవ మతంలో అతిపెద్ద విభాగమైన క్యాథలిక్కులకు సారథ్యం వహిస్తోన్న పోప్ 2013 ఫిబ్రవరి 11న రాజీనామా చేస్తున్నట్లు తన నిర్ణయాన్ని ప్రకటించారు. 2005లో పోప్‌గా బాధ్యతలు చేపట్టిన బెనడిక్ట్ అనారోగ్య కారణాలతో తప్పుకోవాలనుకుంటున్నట్లు ప్రకటించారు. దైవ నిర్ణయం మేరకే తన పదవికి రాజీనామా చేస్తున్నానని, తన వారసుడ్ని భగవంతుడే ఎంపిక చేస్తారని ఆనాడు ప్రకటించారు. 16వ పోప్ బెనడిక్ట్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. 600 సంవత్సరాల వాటికన్ చరిత్రలో రాజీనామా చేస్తున్న పోప్‌గా బెనడిక్ట్ రికార్డు సృష్టించారు. 2005లో పోప్ జాన్‌పాల్ – 2 మరణం తర్వాత బాధ్యతలు చేపట్టిన బెనడిక్ట్ సాంప్రదాయక క్యాథలిక్ అధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించేందుకు శరీరం సహకరించనందున రాజీనామా చేయాలని భావిస్తున్నట్లు ఆయన ప్రకటించారు.
Read Also:Rahul Gandhi: బీజేపీ నా గురువు.. రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు..
అతని అసలు పేరు జోసెఫ్ రాట్జింగర్. 1972 ఏప్రిల్ 16న జర్మనీలోని బవేరియాలో జన్మించారు. అతను ఏప్రిల్ 19, 2005న జరిగిన పాపల్ కాన్క్లేవ్‌లో రెండో పోప్ జాన్ పాల్ వారసుడిగా ఎన్నికయ్యాడు. ఏప్రిల్ 25న పోప్‌గా తన మొదటి యూకారిస్ట్‌ను జరుపుకున్నాడు. అదే సంవత్సరం మే 7న నియమించబడ్డాడు. అతను 2005 నుండి 2013 వరకు పోప్‌గా ఉన్నారు. పోప్ బెనెడిక్ట్ XVI జర్మన్, వాటికన్ పౌరసత్వాలను కలిగి ఉన్నారు. జర్మనీ నుండి ఎన్నికైన తొమ్మిదవ పోప్. పోప్ జర్మన్, ఇటాలియన్, ఫ్రెంచ్, ఇంగ్లీష్, స్పానిష్, లాటిన్, గ్రీక్ మరియు హీబ్రూ భాషలను మాట్లాడగలరు. పియానో వాయించడంతో ప్రావీణ్యుడు.