Manda Jagannatham : మాజీ పార్లమెంటు సభ్యుడు డాక్టర్ మందా జగన్నాథం (73) గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ, హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఆయన కుటుంబంలో భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. 1996లో తెలుగు దేశం పార్టీలో చేరిన ఆయన, మహబూబ్‌నగర్ జిల్లాలోని నాగర్ కర్నూల్ పార్లమెంటు స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించారు. అనంతరం వరుసగా 1996, 1999, 2004, 2009 ఎన్నికల్లో విజయం సాధించి…
బీజేపీకి భారీ షాక్ తగిలింది. మాజీ ఎంపీ సోయం బాపు రావు కాంగ్రెస్ లో చేరారు. బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ సమక్షంలో కాంగ్రెస్ కండువు కప్పుకున్నారు. ఆయనతో పాటుగా అత్రం సక్కు కూడా హస్తం గూటికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "బీజేపీ కి రాజీనామా చేశా. రేవంత్ చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్శితున్ని అయ్యాను. అన్నీ మతాలను నేను గౌరవిస్తాను. కాంగ్రెస్ సిద్ధాంతాలకు కట్టుబడి…
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. కాగా.. ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ ఎంపీ, బీజేపీ నేత నవనీత్ రాణా ర్యాలీలో ప్రసంగించేందుకు అమరావతిలోని దరియాపూర్‌లోని ఖల్లార్ గ్రామానికి చేరుకున్నారు. ఆమె వేదికపై ప్రసంగం ముగించి కిందకు రాగానే కొందరు ఆమెపై కుర్చీలు విసిరేందుకు ప్రయత్నించారు. దీంతో ఈ ప్రచార సభలో పెద్ద దుమారమే రేగింది.