Margani Bharat: వారిపై చర్యలు తీసుకొండి.. పోలీసులకు మాజీ ఎంపీ ఫిర్యాదు
- తమ ఇష్టా రాజ్యంగా విధ్వంసకర చర్యలకు పాల్పడుతున్న మూకలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరిన రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్
- రాజమండ్రి ఎస్పీ కార్యాలయంలో ఈ మేరకు ఫిర్యాదు చేశారు
- అడిషనల్ ఎస్పీ సార్కర్ కు లిఖితపూర్వక ఫిర్యాదు చేసిన భరత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Margani Bharat: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాక ముందే తమ ఇష్టా రాజ్యంగా విధ్వంసకర చర్యలకు పాల్పడుతున్న మూకలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ పోలీసులను కోరారు.. రాజమండ్రి ఎస్పీ కార్యాలయంలో ఈ మేరకు ఫిర్యాదు చేశారు. అడిషనల్ ఎస్పీ సార్కర్ కు లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. అలాగే మోరంపూడి ఫ్లై ఓవర్ బ్రిడ్జి శిలాఫలకాన్ని టీడీపీ శ్రేణులు ధ్వంసం చేస్తున్న వీడియోలు, సీసీ పుటేజీ, పెన్ డ్రైవ్ తదితర ఆధారాలను అడిషనల్ ఎస్పీకి ఈ సందర్భంగా మాజీ ఎంపీ అందజేశారు. సీతంపేట మూలగొయ్యికి చెందిన సాయి అనే యువకుడిపై టీడీపీకి చెందిన కొంతమంది మారణాయుధాలతో దాడిచేశారని, బాధితుని తలకు నాలుగు కుట్లు పడ్డాయని అడిషనల్ ఎస్పీకి మాజీ ఎంపీ వివరించారు. గాయపడ్డ సాయిని అడిషనల్ ఎస్పీకి చూపించారు. ఇటువంటి విష సంస్కృతి గతంలో రాజమండ్రిలో లేదని మాజీ ఎంపీ భరత్ ఆవేదన వ్యక్తం చేశారు.
Read Also: Noor Malabika: నూర్ మరణంపై మౌనం వీడిన కుటుంబ సభ్యులు.. షాకింగ్ విషయాలు వెలుగులోకి
Also Read
- Ind Vs WI: ఆఖర్లో టీమిండియా మెరుపులు.. ముగిసిన భారత్ బ్యాటింగ్..
- PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
- Abhishek Sharma: సూర్యకుమార్ యాదవ్ రికార్డును మడతపెట్టేసిన అభిషేక్ శర్మ.. వరల్డ్ రికార్డు..
- Police VS CJP: అభిజిత్ దీప్కే ఆరోపణలు.. సాక్ష్యంగా ఢిల్లీ పోలీసులు వీడియో రిలీజ్.
ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారిని భరత్ కోరారు. పోలీసులు తగు చర్యలు తీసుకుంటారనే ఆశిస్తున్నానని, న్యాయం జరగకుంటే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని మీడియా అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా మాజీ ఎంపీ భరత్ చెప్పారు. ఇటువంటి దాడులు మళ్లీ మళ్లీ నగరంలో జరగకూడదనే పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. అధికారం ఉంది కదా అని ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తే చూస్తూ సహించేది లేదన్నారు. రాజమండ్రి నగరంలో ప్రశాంత వాతావరణం కొనసాగాలన్నదే తమ అభిలాష అన్నారు. క్రమ శిక్షణ గల పార్టీ అని చెప్పే రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ప్రోద్భలంతోనే మోరంపూడి జంక్షన్ వద్ద ఫ్లై ఓవర్ బ్రిడ్జి శిలాఫలకాన్ని ధ్వంసం చేశారని, వారందరి పేర్లూ అడిషనల్ ఎస్పీకి అందజేశామన్నారు. టీడీపీ క్రమశిక్షణ ఇదేనా అంటూ ప్రశ్నించారు మాజీ ఎంపీ భరత్.
తాజావార్తలు
-
Ind Vs WI: ఆఖర్లో టీమిండియా మెరుపులు.. ముగిసిన భారత్ బ్యాటింగ్..
-
PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
-
Festive Sale: పండుగ షాపింగ్ తుఫాన్.. 48 గంటల్లో రూ.24,000 కోట్ల సేల్స్!
-
Abhishek Sharma: సూర్యకుమార్ యాదవ్ రికార్డును మడతపెట్టేసిన అభిషేక్ శర్మ.. వరల్డ్ రికార్డు..
-
El Nino : తెలంగాణలో కరువు ముప్పు.. రెండో పంట వేయొద్దంటూ మంత్రి కీలక విజ్ఞప్తి
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!