పాఠశాలలను దేవాలయాలుగా భావిస్తారు. భావి భారత పౌరులు రూపుదిద్దుకునేది పాఠశాలల్లోనే. అంతటి ప్రాముఖ్యత ఉన్న స్కూల్స్ లో డ్రగ్స్ తయారీకి తెగబడ్డాడు సమాజం పట్ల బాధ్యత లేని ఓ వ్యక్తి. బోయిన్‌పల్లి పరిధిలోని ఒక స్కూల్ లోపలే పెద్ద ఎత్తున మత్తుమందు తయారీ జరుగుతుందని గూఢచారి సమాచారంపై ఈగల్ టీం దాడి చేసింది. ఈ ఘటనలో సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి.
Also Read:Asaduddin: క్రికెట్ మ్యాచ్ 26 మంది ప్రాణాల కంటే విలువైనదా..?
నిందితుడు జయప్రకాష్ గౌడ్ నర్సరీ నుండి 10 వ తరగతి వరకు మేధా హై స్కూల్ నడుపుతున్నట్లు గుర్తించారు. G+2 బిల్డింగ్ లో కేవలం 6 రూమ్ లలోనే స్కూల్ నిర్వహణ.. 2018 నుండి నడుస్తున్న స్కూల్.. రెండు సంవత్సరాల క్రితం స్కూల్ కు వచ్చిన జయప్రకాష్ గౌడ్.. అప్పటి నుండి అన్ని తానై నిర్వహిస్తున్న నిందితుడు.. చుట్టుపక్కల ఉండే పేద విద్యార్థులకు తక్కువ ఫీజుకు చదువు అంటూ చెబుతున్న జయప్రకాష్ గౌడ్.. 5 రూంలలో క్లాస్ లు నిర్వహణ.. ఒక వైపు క్లాస్ రూమ్ లు, మరో వైపు డ్రగ్స్ తయారీకి పాల్పడుతున్నాడు. ఒక రూమ్ లో అల్ప్రాజోలం డ్రగ్స్ తయారీ చేస్తున్న జయప్రకాష్ గౌడ్.
Also Read:Jasmin Lamboria: ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో.. స్వర్ణంతో మెరిసిన జాస్మిన్ లంబోరియా
రోజు డ్రగ్స్ తయారీ కోసం వాహనంలో వచ్చిన జయప్రకాష్ గౌడ్.. సెలవు రోజుల్లో విక్రయాలు చేస్తున్న జయప్రకాష్ గౌడ్.. ఈరోజు కూడా విక్రయం చేస్తుండగా పట్టుకున్న ఈగల్ టీమ్.. ప్రమాదకరంగా నడుస్తున్న బోయినపల్లి మేధా స్కూల్.. స్కూల్ ఫస్ట్ ఫ్లోర్ లో పెద్ద సంఖ్యలో రియాక్టర్లు గుర్తింపు.. డ్రగ్స్ తయారీ కోసం ఫ్యాక్టరీ స్టైల్ లో ఫస్ట్ ఫ్లోర్ లో 8 రియాక్టర్లు ఏర్పాటు చేసుకున్న జయప్రకాష్.. అచ్చం ఫ్యాక్టరీని తలపించేలా ఉన్న జయప్రకాష్ గౌడ్ రూమ్.. జయప్రకాష్ గౌడ్ డ్రగ్స్ తయారు చేసే రూమ్ లోకి ఎవరు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు గుర్తించారు.