హైదరాబాద్‌లోని పాత బస్తీలో గుల్జార్ హౌస్ సమీపంలో అగ్నిప్రమాదం జరిగి 17 మంది మృతి చెందటం అత్యంత బాధాకరమని మాజీ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. తాజాగా విడుదల చేసి ప్రెస్ నోట్‌లో ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మంటల్లో చిక్కుకున్న కుటుంబాలను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని, క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని ప్రభుత్వాన్ని కోరారు.
Mirchowk Fire Accident : హైదరాబాద్‌లోని పాతబస్తీ మీర్‌చౌక్‌లో జరిగిన భారీ అగ్నిప్రమాదం మరింత విషాదాన్ని నింపింది. సహాయక చర్యలు కొనసాగుతుండగా, ఈ దుర్ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య 17కు చేరుకుంది. మృతుల్లో ఎనిమిది మంది చిన్న పిల్లలు ఉండటం హృదయాలను కలిచివేస్తోంది. మృతి చెందిన చిన్నారుల్లో ఒకటిన్నర సంవత్సరం వయస్సున్న ఒకరు, ఏడేళ్ల వయస్సున్న మరొకరు ఉన్నారు. మిగిలిన ఆరుగురు పిల్లలు నాలుగు సంవత్సరాల లోపు వారే కావడం ఈ దుర్ఘటన తీవ్రతను తెలియజేస్తోంది.…
CM Revanth Reddy: హైదరాబాద్‌లోని పాతబస్తీ మీర్ చౌక్ ప్రాంతంలో జరిగిన విషాదకరమైన అగ్నిప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. సమాచారం తెలిసిన వెంటనే స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి, సహాయక చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని, వారికి అన్ని విధాలా సహాయం చేయాలని సూచించారు. UP: పెళ్లైన ఆరు…