Site icon NTV Telugu

Satya Pal Malik: సీబీఐ ఛార్జిషీట్ అనంతరం.. క్షీణించిన జమ్మూకశ్మీర్ మాజీ గవర్నర్ ఆరోగ్యం..

Satya Pal Malik

Satya Pal Malik

అవినీతి కేసులో సీబీఐ చర్య అనంతరం జమ్మూ కశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ ఆరోగ్యం క్షీణించింది. గురువారం, మాలిక్ సహా 6 మందిపై సీబీఐ అధికారికంగా ఛార్జిషీట్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఛార్జిషీట్ అనంతరం తాను ఆసుపత్రిలో చేరానని, తన పరిస్థితి చాలా విషమంగా ఉందని మాలిక్ సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. మాలిక్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఫోటోను పోస్ట్ చేశారు. అందులో ఆయన హాస్పిటల్ బెడ్‌పై కనిపిస్తున్నారు. “నా శ్రేయోభిలాషుల నుంచి నాకు కాల్స్ వస్తున్నాయి. కానీ నేను వాటిని స్వీకరించలేకపోతున్నాను. ప్రస్తుతం నా పరిస్థితి చాలా దారుణంగా ఉంది. నేను ప్రస్తుతం ఆసుపత్రిలో చేరాను. ఎవరితోనూ మాట్లాడలేని స్థితిలో ఉన్నాను” అని రాసుకొచ్చారు.

READ MORE: Cyber Crime: అచ్యుతాపురంలో సైబర్ డెన్ గుట్టురట్టు.. కాల్ సెంటర్ ముసుగులో..!

అసలు విషయం ఏంటి?
2,200 కోట్ల విలువైన కిరు హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్ (హెచ్‌ఇపి)లో పనులు కేటాయింపులో అవినీతి జరిగిందని ఆరోపణలు వచ్చాయి. దాంతో ఏప్రిల్‌ 2022లో మాలిక్‌తో సహా ఐదుగురు వ్యక్తులపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ గతంలో మాజీ గవర్నర్‌కి చెందిన నివాసంలో సోదాలు చేపట్టింది. తాజాగా కిరు జలవిద్యుత్ ప్రాజెక్టులో రూ.2,200 కోట్ల సివిల్ వర్క్స్ కాంట్రాక్టులో అవినీతి జరిగిందనే ఆరోపణలకు సంబంధించి సత్య పాల్ మాలిక్ తోపాటు మరో ఐదుగురిపై సీబీఐ ఛార్జిషీట్ దాఖలు చేయడం గమనార్హం. అధికారులు గురువారం ఈ సమాచారం ఇచ్చారు. మూడేళ్ల దర్యాప్తు తర్వాత ఏజెన్సీ ప్రత్యేక కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేసింది.

READ MORE: High Court: ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అత్త ఝాన్సీ రెడ్డికి హైకోర్టు షోకాజ్ నోటీసులు

Exit mobile version