అవినీతి కేసులో సీబీఐ చర్య అనంతరం జమ్మూ కశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ ఆరోగ్యం క్షీణించింది. గురువారం, మాలిక్ సహా 6 మందిపై సీబీఐ అధికారికంగా ఛార్జిషీట్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఛార్జిషీట్ అనంతరం తాను ఆసుపత్రిలో చేరానని, తన పరిస్థితి చాలా విషమంగా ఉందని మాలిక్ సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. మాలిక్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఫోటోను పోస్ట్ చేశారు.
తెలంగాణ ప్రజలనుద్దేశించి మాజీ గవర్నర్ తమిళిసై ఓ సందేశం ఇచ్చారు. నా ప్రియమైన తెలంగాణ సోదర సోదరీమణులారా.. నేను తెలంగాణ గవర్నర్ పదవి నుంచి వైదొలగుతున్నప్పుడు, అనేక భావోద్వేగాలతో మునిగిపోయాను. ఈ అద్భుతమైన రాష్ట్రానికి సేవ చేయడం చాలా ఆనందం కలిగించింది. అన్నింటికీ మించి తెలంగాణాలోని నా సోదర సోదరీమణుల ఆప్యాయత నన్ను బాగా ఆకట్టుకుందని తెలిపారు.