అవినీతి కేసులో సీబీఐ చర్య అనంతరం జమ్మూ కశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ ఆరోగ్యం క్షీణించింది. గురువారం, మాలిక్ సహా 6 మందిపై సీబీఐ అధికారికంగా ఛార్జిషీట్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఛార్జిషీట్ అనంతరం తాను ఆసుపత్రిలో చేరానని, తన పరిస్థితి చాలా విషమంగా ఉందని మాలిక్ సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. మాలిక్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఫోటోను పోస్ట్ చేశారు.
Singareni : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో ఉన్న సింగరేణి ప్రధాన ఆసుపత్రిలో నిన్న సాయంత్రం నుంచి విజిలెన్స్ దాడులు కొన సాగాయి. సి ఎం ఓ లో మెడికల్ అధికారి గా ఉన్న ఆమె భర్త ,కూతురు సెల్ ఫోన్ విజిలెన్స్ శాఖ సంబంధించిన పైళ్ళు స్వాధీనం చేసుకొని విచారణ చేపట్టినట్టుగా తెలుస్తుంది. ఈనెల 31న రిటైర్మెంట్ కావలసి ఉండగా తాజాగా విజిలెన్స్ అధికారులు దాడులు చేసి ఫైళ్లను స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తుంది. ఇటీవల జరిగిన…
Komatireddy Venkat Reddy : పద్మవిభూషణ్ అవార్డు అందుకున్న ఎషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ హాస్పిటల్ ఛైర్మన్ డా. డి నాగేశ్వర్ రెడ్డిని సన్మానించారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. వైద్యరంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న డాక్టర్ డి.నాగేశ్వర్ రెడ్డిని కేంద్ర ప్రభుత్వం పద్మవిభూషణ్ అవార్డుతో సత్కరించడం తెలుగు వారందరికి గర్వకారణమన్నారు. గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగంలో వారు చేసినంత పరిశోధనలు, ఆవిష్కరణలు మరో డాక్టర్ చేసి ఉండరంటే…
Civil Supply Corruption : వనపర్తి జిల్లాలో సివిల్ సప్లై అవినీతి అక్రమాలపై చీఫ్ విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టారు . సియం ఆర్ ధాన్యం మాయం, నిర్మాణాలు పూర్తి కాని రైస్ మిల్లులకు ధాన్యం కేటాయింపు . డిఫాల్ట్ రైస్ మిల్లులకు ధాన్యం కేటాయింపులపై మూడు రోజులుగా విచారణ కొనసాగుతోంది . జిల్లాలో పనిచేస్తున్న సివిల్ సప్లై అధికారి , పౌర సరఫరాల శాఖ మేనేజర్, ఎన్ ఫోర్స్ మెంట్ డిటి లను హైదరాబాద్ లోని…
Lokayukta MUDA Probe: కర్ణాటక హైకోర్టు గురువారం మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా) కుంభకోణంపై లోకాయుక్త పోలీసుల విచారణ నివేదికను జనవరి 28లోపు సమర్పించేందుకు గడువు పొడిగించింది. డిసెంబర్ 24 నాటికి లోకాయుక్త నివేదికపై పురోగతిని చూపించాల్సిందని ఆదేశించిన కింది స్థాయి కోర్టు ఆదేశాలను, హైకోర్టు ఇప్పుడు నిరాకరించింది. ప్రస్తుతం ఈ కేసు విచారణలో న్యాయమూర్తి జస్టిస్ ఎం. నాగప్రసన్నా ఉండగా.. జనవరి 28 వరకు లోకాయుక్త నివేదిక సమర్పించకూడదని ఆదేశించారు. Also Read: CM…
గత ప్రభుత్వ హయాంలో ఈ-ఫార్ములా రేసు కోసం విదేశీ కంపెనీకి నిబంధనలతు విరుద్ధంగా నిధులు బదలాయించారన్న కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ-ఫార్ములా రేసు నిధుల బదలాయింపుపై విచారణకు గవర్నర్ ఆమోదం తెలిపారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం వెల్లడించింది. న్యాయనిపుణుల సలహాలు తీసుకుని గవర్నర్ ఆమోదం తెలిపారని.. సీఎస్ ద్వారా ఏసీబీకి లేఖ పంపుతామని ప్రభుత్వం పేర్కొంది.