అవినీతి కేసులో సీబీఐ చర్య అనంతరం జమ్మూ కశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ ఆరోగ్యం క్షీణించింది. గురువారం, మాలిక్ సహా 6 మందిపై సీబీఐ అధికారికంగా ఛార్జిషీట్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఛార్జిషీట్ అనంతరం తాను ఆసుపత్రిలో చేరానని, తన పరిస్థితి చాలా విషమంగా ఉందని మాలిక్ సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. మాలిక్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఫోటోను పోస్ట్ చేశారు.
Satya Pal Malik: సుమారు రూ. 2200 కోట్ల విలువైన కిరు జల విద్యుత్ ప్రాజెక్టు సివిల్ వర్క్స్ కాంట్రాక్టుల మంజూరుకు సంబంధించి అవినీతి కేసులో జమ్మూ కాశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్‌కి ఉచ్చు బిగిస్తోంది. సీబీఐ ఆయనపై గురువారం ఛార్జిషీట్ దాఖలు చేసింది. కిష్ట్వార్‌లో కిరు జల విద్యుత్ ప్రాజెక్టు టెంటర్ల ప్రక్రియకలో జరిగిన అనుమానిత అక్రమాలకు సంబంధించిన కేసులో ఆయన ప్రమేయం ఉన్నట్లుగా ఆరోపణలు ఉన్నాయి.
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఇతరులపై దాఖలు చేసిన సీబీఐ చార్జిషీట్‌ను ఆగస్టు 12న ఢిల్లీ కోర్టు పరిశీలించాలని నిర్ణయించింది.
దేశవ్యాప్తంగా మణిపుర్ రాష్ట్రంలో హింసాత్మక దాడుల ఘటనలో పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించడంతో పాటు సాయం కోరి వచ్చిన బాధితులను ఏమాత్రం పట్టించకోకపోగా.. అల్లరిమూకలకు సహకరించేలా వ్యవహరించారని సీబీఐ తన ఛార్జిషీటులో తెలిపింది.
1984 సిక్కు వ్యతిరేక అల్లర్లలో జగదీష్ టైట్లర్‌పై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబిఐ) దాఖలు చేసిన ఛార్జిషీట్‌లోని ప్రత్యక్ష సాక్షుల కథనాల ప్రకారం.. కాంగ్రెస్ నాయకుడు గుంపును ప్రేరేపించి, మైదానంలో అల్లర్లకు నాయకత్వం వహించారని దర్యాప్తు సంస్థ సీబీఐ ఆరోపించింది.
రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్‌జేడీ)కి భారీ ఎదురుదెబ్బ తగిలింది. బీహార్ ఉపముఖ్యమంత్రి తేజస్వి యాదవ్‌తో పాటు ఆయన తల్లిదండ్రులు, మాజీ ముఖ్యమంత్రులు లాలూ యాదవ్, రబ్రీ దేవిలపై ఉద్యోగాల కుంభకోణంలో సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసింది.
వైఎస్ వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్‌రెడ్డి హస్తం ఉందంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఏపీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఖండించారు. 2019 ఎన్నికలకు ముందు జరిగిన వివేకా హత్య సీఎం జగన్‌ను ఎంతో కుంగదీసిందని ఆయన పేర్కొన్నారు. వివేకా హత్యపై కొన్ని మీడియా సంస్థలు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నాయని సజ్జల మండిపడ్డారు. సీబీఐ ఛార్జ్‌షీట్ పేరుతో కేసుతో సంబంధం లేని వారిపై కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఇదంతా ఒక పథకం ప్రకారం జరుగుతోందని పేర్కొన్నారు. ఈ…
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.. పులివెందుల కోర్టులో ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది సీబీఐ.. ఈ కేసులో గంగిరెడ్డి, సునీల్ యాదశ్, ఉమా శంకర్‌రెడ్డి, దస్తగిరిపై అభియోగాలు మోపింది.. వివేకానందరెడ్డి మృతికి ఆ నలుగురు కారణమని పేర్కొంది.. ఇక, ఈ కేసులో నిందితులైనవారిని ఆగస్టు, సెప్టెంబర్‌లో అరెస్టు చేశామని.. అరెస్ట్ చేసిన నిందితులను జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించామని తెలిపింది. మరోవైపు, ఇద్దరు నిందితులకు కోర్టు బెయిల్…
న్యాయవ్యవస్థపై, న్యాయమూర్తులపై అభ్యంతరకర వ్యాఖ్యల కేసులో మరో ఛార్జిషీట్ దాఖలు చేసింది సీబీఐ.. విజయవాడలోని సీబీఐ ప్రత్యేక కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేశారు అధికారులు.. ఈ ఛార్జిషీట్‌లో నలుగురిపై అభియోగాలు నమోదు చేసింది సీబీఐ.. ధనిరెడ్డి కొండారెడ్డి, పాముల సుధీర్, ఆదర్శ రెడ్డి, లవునిరు సాంబశివారెడ్డిలపై అభియోగాలు మోపింది.. ఇక, ఈ కేసులో మరో 16 మంది పేర్లను ఛార్జిషీట్‌లో పొందుపర్చింది సీబీఐ.. కాగా, ప్రభుత్వానికి సంబంధించిన కేసుల్లో తీర్పు ఇచ్చిన న్యాయమూర్తులపై సోషల్ మీడియా వేదికగా…