Site icon NTV Telugu

Lakshmi Narayana: మైనింగ్ కేసులో గాలి జనార్దన్ రెడ్డికి ఏడేళ్ల జైలు శిక్ష.. స్పందించిన మాజీ జేడీ లక్ష్మీనారాయణ

Laxminarayana

Laxminarayana

ఓబుళాపురం మైనింగ్ కేసులో కోర్టు తీర్పుని స్వాగతిస్తున్నట్లు మాజీ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. ఇటువంటి తీర్పులు వెలువడినప్పుడు మైనింగ్ లో అక్రమాలు చెయ్యాలనుకునే వారికి దడ పుడుతుందన్నారు.. ఇలాంటి కేసులకు ప్రత్యేక కోర్టుల ద్వారా త్వరితగతిన విచారణ చేపట్టి తీర్పుని వెలువర్చే విధంగా ఫాస్ట్ ట్రాక్ ఉండాలని అభిప్రాయం వ్యక్తం చేశారు.. ఎంత ఆలస్యం అయితే అంత నీరుగారే ప్రమాదం ఉంటుందని స్పష్టం చేశారు.. అప్పట్లో ఇలాంటి ఎన్నో పెద్ద కేసులను తాము డీల్ చేసినట్లు చెప్పారు. తమపై ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేకుండా స్వతంత్రంగా పని చేశామని గుర్తు చేశారు..884 కోట్ల రూపాయలు ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేయడమే కాకుండా మని లాండరింగ్ కి కూడా పాల్పడ్డారన్నారు.. దోషులకు శిక్ష పడటం స్వాగతించాల్సిన విషయమని తెలిపారు… సీబీఐలో అప్పటి అధికారులు అనేకమంది ఈ కేసులో చాలా కృషి చేశారని గుర్తు చేశారు…

READ MORE: YS Jagan: రేపు పార్లమెంటరీ పార్టీ నేతలతో వైఎస్ జగన్ భేటీ..

కాగా.. ఓబులాపురం మైనింగ్ కేసులో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం మంగళవారం తుది తీర్పు వెల్లడించింది. ఈ కేసులో ఏ2గా ఉన్న కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డికి ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. గాలి జనార్దన్ రెడ్డితో సహా నలుగురికి ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. ప్రస్తుతం గాలి జనార్దన్ రెడ్డి కర్ణాటకలోని గంగావతి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ కేసులో ఆయనకు ఏడేళ్ల జైలు శిక్ష ఖరారు కావడంతో ఆయనపై అనర్హత వేటు పడే అవకాశం ఉంది. ‘కల్యాణ రాజ్య ప్రగతి పక్ష’ అనే పొలిటికల్ పార్టీని స్థాపించి 2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో గాలి జనార్దన్ రెడ్డి గంగావతి నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మళ్లీ బీజేపీలో చేరిపోయారు. అయితే.. సీబీఐ కోర్టు వెలువరించిన తీర్పును ఉన్నత న్యాయస్థానాల్లో సవాల్ చేసే అవకాశం కూడా ఉంది.

READ MORE: Hari Hara Veera Mallu : ఐదేళ్ల సుదీర్ఘ ప్రయాణం.. ఎన్నో కుదుపులు, మలుపులు!

Exit mobile version