ఓబుళాపురం మైనింగ్ కేసులో కోర్టు తీర్పుని స్వాగతిస్తున్నట్లు మాజీ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. ఇటువంటి తీర్పులు వెలువడినప్పుడు మైనింగ్ లో అక్రమాలు చెయ్యాలనుకునే వారికి దడ పుడుతుందన్నారు.. ఇలాంటి కేసులకు ప్రత్యేక కోర్టుల ద్వారా త్వరితగతిన విచారణ చేపట్టి తీర్పుని వెలువర్చే విధంగా ఫాస్ట్ ట్రాక్ ఉండాలని అభిప్రాయం వ్యక్తం చేశారు.. ఎంత ఆలస్యం అయితే అంత నీరుగారే ప్రమాదం ఉంటుందని స్పష్టం చేశారు..
ఇజ్రాయిల్ లో వేల సంఖ్యలో జనం నిరసన ప్రదర్శన చేపడుతున్నారు. ఆ దేశ రక్షణ శాఖ మంత్రి యోవా గాలెంట్ ను ప్రధాని బెంజిమెన్ నెతాన్యూ ను తొలగించారు. దీంతో ప్రధాని నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఇజ్రాయిల్ ప్రజలు ఆందోళన బాట పట్టారు.