ఓబుళాపురం మైనింగ్ కేసులో కోర్టు తీర్పుని స్వాగతిస్తున్నట్లు మాజీ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. ఇటువంటి తీర్పులు వెలువడినప్పుడు మైనింగ్ లో అక్రమాలు చెయ్యాలనుకునే వారికి దడ పుడుతుందన్నారు.. ఇలాంటి కేసులకు ప్రత్యేక కోర్టుల ద్వారా త్వరితగతిన విచారణ చేపట్టి తీర్పుని వెలువర్చే విధంగా ఫాస్ట్ ట్రాక్ ఉండాలని అభిప్రాయం వ్యక్తం చేశారు.. ఎంత ఆలస్యం అయితే అంత నీరుగారే ప్రమాదం ఉంటుందని స్పష్టం చేశారు..
హైదరాబాద్ కేంద్రంగా ఐటీ అధికారులు పలుమార్లు దాడులు చేసిన నేపథ్యంలో పలువురు పారిశ్రామిక వేత్తలు, వ్యాపారులు, రాజకీయ నాయకులు ఐటీ దాడులపై ఆందోళన చెందుతున్నారు. ఎప్పుడు ఎవరిపై దాడి చేస్తారో తెలియని పరిస్థితుల్లో తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అయితే ప్రస్తుతం హైదరాబాద్‌లో సీబీఐ సోదాలు నిర్వహిస్తోంది. పాతబస్తీలోని ఆరు చోట్ల సీబీఐ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ కార్యాలయాల్లో సోదాలు కొనసాగుతున్నాయి.