ఓబుళాపురం మైనింగ్ కేసులో కోర్టు తీర్పుని స్వాగతిస్తున్నట్లు మాజీ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. ఇటువంటి తీర్పులు వెలువడినప్పుడు మైనింగ్ లో అక్రమాలు చెయ్యాలనుకునే వారికి దడ పుడుతుందన్నారు.. ఇలాంటి కేసులకు ప్రత్యేక కోర్టుల ద్వారా త్వరితగతిన విచారణ చేపట్టి తీర్పుని వెలువర్చే విధంగా ఫాస్ట్ ట్రాక్ ఉండాలని అభిప్రాయం వ్యక్తం చేశారు.. ఎంత ఆలస్యం అయితే అంత నీరుగారే ప్రమాదం ఉంటుందని స్పష్టం చేశారు..
ఈరోజు ఏపీలో జుడిషియరీ వర్సెస్ ఎగ్జిక్యూటీవ్ అనే అంశంపై ఆంధ్రా విజ్జమ్ ఫెస్టివల్ నేతృత్వంలో సమావేశం నిర్వహించారు. అందులో సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ మాట్లాడుతూ… మెజారిటీ వాళ్ళు నిర్ణయించేది చట్టం కాదు. ఇలాంటి నిర్ణయాలను సరి చేసేందుకే న్యాయ వ్యవస్థ ఉంది. వ్యవస్థలో వ్యక్తి పూజ మంచిది కాదని అంబేద్కర్ అన్నారు. ఆందోళనలు, సత్యాగ్రహాలు లేకుండా చూడాలి అయితే.. ఇప్పుడు అలా జరగడం లేదు. రైతులు వందల రోజులు ఆందోళనలు చేస్తున్నారు వారిని పట్టించుకోవడం లేదు…