ఓబుళాపురం మైనింగ్ కేసులో కోర్టు తీర్పుని స్వాగతిస్తున్నట్లు మాజీ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. ఇటువంటి తీర్పులు వెలువడినప్పుడు మైనింగ్ లో అక్రమాలు చెయ్యాలనుకునే వారికి దడ పుడుతుందన్నారు.. ఇలాంటి కేసులకు ప్రత్యేక కోర్టుల ద్వారా త్వరితగతిన విచారణ చేపట్టి తీర్పుని వెలువర్చే విధంగా ఫాస్ట్ ట్రాక్ ఉండాలని అభిప్రాయం వ్యక్తం చేశారు.. ఎంత ఆలస్యం అయితే అంత నీరుగారే ప్రమాదం ఉంటుందని స్పష్టం చేశారు..
పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి (పీఎన్‌బీ) వేల కోట్ల రూపాయల రుణాలను తీసుకుని.. ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన వజ్రాల వ్యాపారి మెహుల్ ఛోక్సీ బెల్జియంలో అరెస్టయ్యాడు. ఏడాది కిందటే ఆ దేశానికి వచ్చిన అతడిని తమకు అప్పగించాలంటూ భారత దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చేసిన అభ్యర్థన కారణంగానే అక్కడి అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అయితే.. ఈయన మాదిరిగానే మరి కొందరు కూడా బ్యాంకులను మోసం చేసిన విదేశాలకు పారిపోయారు. వారి గురించి ఒక్కొక్కరిగా…