Kiran Kumar Reddy: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రిగా పనిచేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి.. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం పనిచేశారు.. పార్టీలో వివిధ హోదాల్లో పనిచేసిన ఆయన.. ప్రజాప్రతినిధిగా కూడా సేవలు అందించారు.. అయితే, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కన్నుమూసిన తర్వాత.. ఆయనకు సీఎం అవకాశం కూడా వచ్చింది.. ఆయన సీఎంగా ఉన్న సమయంలో.. తెలంగాణ ఉద్యమం ఓవైపు.. సమైక్యాంధ్ర ఉద్యమం మరోవైపు ఉధృతంగా సాగాయి.. అయితే, కాంగ్రెస్ అధిష్టానం, కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో మొత్తంగా.. రాష్ట్రం రెండుగా చీలింది.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భవించింది.. కాంగ్రెస్ ఊహించినదాని ప్రకారం తెలంగాణలో అధికారంలోకి రాకపోగా.. ఏపీలో పార్టీ తుడిచిపెట్టుకుపోయింది.. ఇక, ఉమ్మడి ఏపీ చివరి సీఎంగా పనిచేసిన కిరణ్‌కుమార్ రెడ్డి.. రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు.. మళ్లీ కాంగ్రెస్‌లో యాక్టివ్ అవుతారని అంతా భావించారు.. కానీ, కాంగ్రెస్‌కు షాకిచ్చిన ఆయన.. అనూహ్యంగా బీజేపీలో చేరడం చర్చగా మారింది..
ఢిల్లీలో ఈ రోజు కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్, ఓబీసీ మోర్చా అధ్యక్షుడు లక్ష్మణ్ సమక్షంలో బీజేపీ కండువా కప్పుకున్నారు కిరణ్ కుమార్ రెడ్డి.. ఆయనకి బీజేపీ సభ్యత్వాన్ని అరుణ్ సింగ్ అందించారు. అయితే, బీజేపీతో చేరుతూనే కాంగ్రెస్ పార్టీలో ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు కిరణ్‌కుమార్ రెడ్డి.. కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తానని తానెప్పుడూ అనుకోలేదన్న ఆయన… తప్పుడు నిర్ణయాల వల్లే కాంగ్రెస్.. వరుసగా ఒక్కో రాష్ట్రంలో అధికారం కోల్పోతోందన్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ చెల్లాచెదురైందని.. రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ అధిష్టానం ఎవరినీ సంప్రదించకుండా నిర్ణయం తీసుకుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.. అసలు నాయకత్వ లేమితో కాంగ్రెస్ ఇబ్బందులు పడుతోందన్నర ఆయన.. బీజేపీ ఎదుగుతున్నా కొద్దీ కాంగ్రెస్ దిగజారుకుంటూ వచ్చిందని వ్యాఖ్యానించారు.. 1980లో 7.7శాతం ఉన్న బీజేపీ ఓటింగ్.. 2019లో 37 శాతానికి పైగా పెరిగిందంటూ ప్రశంసలు కురిపించారు.. ఇక, తమది 1952 నుంచి కాంగ్రెస్ పార్టీ కుటుంబం.. అయితే, ఓటమి నుంచి కాంగ్రెస్ గుణపాఠాలు నేర్చుకోలేకపోయిందని విమర్శించారు.. కాంగ్రెస్ హైకమాండ్‌కు అధికారం మాత్రమే కావాలంటూ ధ్వజమెత్తిన ఆయన.. కాంగ్రెస్‌లో ట్రబుల్ షూటర్స్ లేకుండా పోయారని పేర్కొన్నారు.. ఇదే సమయంలో బీజేపీపై ప్రశంసలు కురిపించారు కిరణ్‌కుమార్ రెడ్డి.. దేశాన్ని వృద్ధి చేయాలన్నది బీజేపీ లక్ష్యం అన్న ఆయన.. గెలవాలనే తపన, దూరదృష్టి బీజేపీలో మాత్రమే ఉందని కితాబిచ్చారు.. ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్‌షా.. నాయకత్వంలో బీజేపీ దూసుకుపోతుందని వ్యాఖ్యానించారు కిరణ్‌కుమార్ రెడ్డి..
ఇక, కిరణ్‌కుమార్‌రెడ్డి చేరికతో ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ బలోపేతం అవుతుందని పేర్కొన్నారు కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి.. ఎమ్మెల్యేగా, స్పీకర్‌గా, సీఎంగా కిరణ్ కుమార్ రెడ్డి సేవలందించారు.. అయితే, కాంగ్రెస్‌లో ఆయన ఇన్నింగ్స్ ముగిసిందని.. బీజేపీలో చేరి కొత్త ఇన్నింగ్స్ ప్రారంభిస్తున్నారని వ్యాఖ్యానించారు.. అవినీతికి వ్యతిరేకంగా ప్రధాని చేసున్న కృషి కిరణ్ కుమార్ రెడ్డిని ఆకర్షించిందన్న ఆయన.. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో పనిచేయాలని భావిస్తున్నట్లు కొన్ని నెలల ముందు తనకు తెలిపారని.. కిరణ్ కుమార్ రెడ్డి కి క్లీన్ ఇమేజ్ ఉందని చెప్పుకొచ్చారు ప్రహ్లాద్ జోషి.