తెలంగాణ గ్రామీణ రోడ్లకు మహర్దశ రానుంది. రాష్ట్ర ప్రభుత్వం నూతన రోడ్ల నిర్మాణానికి రూ. 1377.66 కోట్లు మంజూరు చేసింది. 92 నియోజకవర్గాల్లో 641 పనులకు కాంగ్రెస్ ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. గ్రామీణ ప్రాంతాల్లో 1323.86 కిలోమీటర్ల మేర నూతన రహదారుల నిర్మాణానికి నిధులు మంజూరు చేసింది. ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నా.. గ్రామీణ రోడ్లకు పట్టు బట్టి నిధులు సాధించామని పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు.
READ MORE: The Raja Saab: ప్రభాస్ రాజా సాబ్ కథ అదే.. ఎస్కేఎన్ ఓపెనయిపోయాడుగా!
ఇదిలా ఉండగా.. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. వికలాంగుల జాబ్ పోర్టల్ ను ఏర్పాటు చేసింది. దివ్వాంగులు ఆఫీసర్లు చుట్టూ తిరిగే పనిలేకుండా నేరుగా జాబ్ పోర్టల్ లో అప్లై చేసుకుంటే చాలని, వారి అర్హతను బట్టి ఉద్యోగం ఉంటుందని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క శుభవార్త చెప్పారు. ఈ మేరకు సచివాలయంలో తెలంగాణ వికలాంగుల జాబ్ పోర్టల్ ను ఆవిష్కరించారు. మహిళా సంక్షేమ శాఖ డైరెక్టరెట్ హెల్ప్ లైన్ లో పదిమందికి అపాయింట్మెంట్ ఆర్డర్లు అందజేశారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ.. ఉపాధి రంగాల్లో దివ్యాంగులకు అవకాశాలు తక్కువ అన్నారు. ఇతర వర్గాల వర్గాల వారిలా ఫైట్ చేయాలంటే ఎన్నో అవరోధాలు ఎదుర్కొన్నాలని తెలిపారు. శారీరకంగా వచ్చే లోపం మన చేతిలో లేదన్నారు. పోషకాహార లోపం, ప్రమాదం వల్ల వికలాంగులుగా మారే ప్రమాదం వుందన్నారు. అందుకే వాళ్లకి ఉపాది అవకాశాలు కల్పించేందుకు ఆన్లైన్ జాబ్ పోర్టల్ ను ప్రారంభిస్తున్నామని తెలిపారు. ప్రైవేటు ఉద్యోగాల్లో వికలాంగులకు రిజర్వేషన్లు పాటించాలని తెలిపారు.
READ MORE: Uddhav Thackeray: ఉద్ధవ్ థాకరేకు అస్వస్థత.. రిలయన్స్ ఆస్పత్రికి తరలింపు