Site icon NTV Telugu

Uttarakhand: ఉత్తరాఖండ్‌లో వరద ఉద్ధృతి.. మునిగిన 15 అడుగుల శివుడి విగ్రహం..(వీడియో)

Uttarakhand

Uttarakhand

ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్‌లలో వరద ఉద్ధృతి కొనసాగుతోంది. వరదల కారణంగా కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఇప్పటికే పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. ఉప్పొంగుతున్న నదులు, భారీ వర్షాల కారణంగా అనేక ప్రాంతాలను విపత్తు అంచుకు నెట్టివేస్తున్నాయి. దీంతో రెండు రాష్ట్రాలు యంత్రాంగాలు అప్రమత్తమయ్యాయి. ఉత్తరాఖండ్‌లోని కొండ ప్రాంతంలో నిరంతరం కురుస్తున్న వర్షాలు వరదల పరిస్థితిని సృష్టించాయి. ముఖ్యంగా రుద్రప్రయాగలో అలకనంద నది 20 మీటర్లకు పైగా ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో ఘాట్‌లు, ఫుట్‌పాత్‌లు నామరూపాలు లేకుండా పోతున్నాయి. బెల్ని వంతెన సమీపంలో ఉన్న 15 అడుగుల ఎత్తైన శివుని విగ్రహం కూడా మునిగిపోయింది. ఈ విగ్రహం కళ్లు నుంచి పై భాగం మాత్రమే కనిపిస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

READ MORE: CM Chandrababu: సీబీఎన్‌ 14 కాదు.. సీబీఎన్‌ 95 ఇక్కడ‌..‌ తప్పుచేస్తే తోక కట్ చేస్తా‌‌‌..!

ఇప్పటికే అధికారులు హెచ్చరికలు జారీ చేస్తూ, ప్రజలు నదీ తీరాలకు దూరంగా ఉండాలని కోరారు. మందాకిని నది వంటి ఉపనదులు కూడా ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి. సమీపంలోని నివాస ప్రాంతాలకు తీవ్రమైన ప్రమాదం పొంచి ఉంది. మండి జిల్లాలో ఇప్పటికే ఒకరు మృతి చెందారు. మరో 9 మంది గల్లంతయ్యారు. హిమాచల్ ప్రదేశ్‌లోని 10 జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ ఆకస్మిక వరదల వల్ల కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని అధికారులు భయపడుతున్నారు. అనేక ప్రాంతాలు ఇప్పటికే భారీ వరదలు, తీవ్ర ఆస్తి నష్టాన్ని తెచ్చిపెట్టాయి. మరోవైపు.. రాబోయే 24 గంటల్లో మండి, కాంగ్రా, సిర్మౌర్, సోలన్లలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ (IMD) అంచనా వేసింది. ఉనా, బిలాస్‌పూర్, హమీర్‌పూర్, సిమ్లా, కులు, చంబాలలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని అంచనా.

READ MORE: Shirish Reddy: నేను మూర్ఖుడిని కాదు .. చరణ్ గారితో సినిమా తీయబోతున్నాం!

Exit mobile version