Prakasam District: తుఫాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు ప్రకాశం జిల్లాలోని గుండ్లకమ్మ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. 14 గేట్లు ఎత్తి ప్రాజెక్టు నుంచి 1.50 లక్షల క్యూసెక్కులు నీటిని అధికారులు దిగువకు వదిలి పెడుతున్నారు. ఒక్కసారిగా అన్ని గేట్లు ఎత్తడంతో పలు గ్రామాల్లోకి వరద నీరు చేరింది.
నాగార్జున సాగర్ ప్రాజెక్టులో వరద పరిస్థితి మరోసారి తీవ్రరూపం దాల్చింది. తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఎగువ ప్రాంతాల నుంచి వరదనీరు పెద్ద ఎత్తున చేరుతోంది. ప్రాజెక్టు నీటిమట్టం 590 అడుగులకు చేరడంతో అధికారులు 8 క్రస్ట్ గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ఇన్‌ఫ్లో 65,842 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 1,09,952 క్యూసెక్కులుగా నమోదైంది. ఇక తెలంగాణకు వాతావరణశాఖ భారీ వర్షాల హెచ్చరిక జారీ చేసింది. రేపు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురిసే…
GHMC: హైదరాబాద్ నగరంలో హుస్సేన్ సాగర్ సరస్సు దగ్గర నీటి స్థాయిలు క్రమంగా పెరిగిపోతున్నాయి. దీంతో సమీపంలోని కాలనీలకు వరద నీరు చేరే ప్రమాదం ఉంది. ప్రస్తుతం కవాడిగూడ, గాంధీనగర్, అరవింద్‌నగర్, సబర్మతినగర్ వంటి ప్రాంతాల్లో నివసించే ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు, వరద ఉధృతి పెరిగే అవకాశాన్ని బట్టి ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం, వరద నీటి నిల్వ స్థాయి పెరుగుతున్న కారణంగా, ఈ ప్రాంతాల్లోకి నీరు చేరే అవకాశం ఉంది. హాట్ లుక్స్…
Prakasam Barrage Flood Alert: ప్రకాశం బ్యారేజీకి వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ నుంచి వరద నీరు ఉద్ధృతి కొనసాగుతుండటంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. నదీపరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ప్రకాశం బ్యారేజీకి వస్తున్న వరదకు అనుగుణంగా అధికారులు నీటిని విడుదల చేస్తున్నామని పేర్కొన్నారు.
ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్‌లలో వరద ఉద్ధృతి కొనసాగుతోంది. వరదల కారణంగా కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఇప్పటికే పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. ఉప్పొంగుతున్న నదులు, భారీ వర్షాల కారణంగా అనేక ప్రాంతాలను విపత్తు అంచుకు నెట్టివేస్తున్నాయి. దీంతో రెండు రాష్ట్రాలు యంత్రాంగాలు అప్రమత్తమయ్యాయి.
ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది.. భద్రాచలం దగ్గర 43 అడుగులకు చేరింది గోదావరి నీటిమట్టం.. దీంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు.. గోదావరి పరివాహక ప్రాంతాలను అలర్ట్ చేశారు.. ఇక, అత్యవసర సేవల కోసం కంట్రోల్ రూమ్‌లను కూడా ఏర్పాటు చేశారు.. ఇటు, దేవీపట్నం మండలంలోని 33 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.. పోలవరం ప్రాజెక్టు దగ్గర కూడా గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది.. ఎగువ కాపర్ డ్యామ్‌పై గోదావరి ఉగ్రరూపం…