హిమాచల్‌ప్రదేశ్‌ను ఆకస్మిక వరదలు హడలెత్తించాయి. దీంతో మండి జిల్లాలో భారీగా ఆస్తి, ప్రాణ నష్టం జరిగింది. ఇప్పటి వరకు 91 మంది చనిపోయారు. ఇక కొండచరియలు విరిగిపడడంతో గ్రామాలకు గ్రామాలే దెబ్బతిన్నాయి.
ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్‌లలో వరద ఉద్ధృతి కొనసాగుతోంది. వరదల కారణంగా కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఇప్పటికే పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. ఉప్పొంగుతున్న నదులు, భారీ వర్షాల కారణంగా అనేక ప్రాంతాలను విపత్తు అంచుకు నెట్టివేస్తున్నాయి. దీంతో రెండు రాష్ట్రాలు యంత్రాంగాలు అప్రమత్తమయ్యాయి.