ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ తాజాగా మరో కొత్త సర్వీస్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందుకు సంబంధించి వివరాలు చూస్తే.. తాజాగా ఫ్లిప్‌కార్ట్ బస్ టికెట్ బుకింగ్ సేవలను మొదలుపెట్టింది. ఈ టికెట్ బుకింగ్ సేవలను ఫ్లిప్‌కార్ట్ ఆయా రాష్ట్ర రవాణా కార్పొరేషన్ లో, ప్రవేట్ ఆపరేటర్లతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇందులో నేపధ్యంగానే హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ, జైపూర్, అహ్మదాబాద్, ఇండోర్, ముంబై, చెన్నై, చండీగఢ్ లతో పాటు మరికొన్ని ప్రముఖ నగరాల నుండి ఈ టికెట్ బుకింగ్ సేవలను అందుబాటులోకి తీసుకురాబోతుంది. ఇక ఈ సేవకు సంబంధించి పూర్తి వివరాలు చూస్తే..
Also read: Kalki 2898AD : కల్కి రిలీజ్ డేట్ వచ్చేస్తుంది.. రెడీ అవ్వండమ్మా..!
ఈ సేవలలో ప్రస్తుతం ఎలాంటి బుకింగ్ చార్జీలు లేకుండా బస్ టికెట్ బుకింగ్ చేసుకోవచు అంటూ సంస్థ తెలిపింది. అలాగే కొత్తగా లాంచ్ చేసిన ఈ సేవలో కారణంగా ఏప్రిల్ నెలలో 15 నుంచి 20% వరకు రాయితీ కల్పించబోతున్నట్లు తెలిపింది. ఈ సేవలో భాగంగా ప్రస్తుతం దేశవ్యాప్తంగా 25 వేల రూట్లలో ఏకంగా 10 లక్షల బస్సుల సర్వీసులకు సంబంధించిన టికెట్ బుకింగ్ సేవలను అందించబోతున్నట్లు ఫ్లిప్కార్ట్ తెలిపింది.
Also read:Maharastra: బావిలో పడిన పిల్లిని కాపాడబోయి ఐదుగురు మృత్యువాత..!
ఇక ఈ సంస్థ ఇప్పటికే ఫ్లైట్ బుకింగ్, హోటల్ బుకింగ్ సేవలను అందిస్తున్న సంగతి తెలిసిందే. ఫ్లిప్‌కార్ట్ లో బస్సు బుకింగ్ ఎలా చేసుకోవాలి అంటే.. బస్ బుకింగ్ యాప్ ప్రయాణ విభాగాన్ని ఓపెన్ చేసి అక్కడ మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు అన్న వివరాలను ఇవ్వడం ద్వారా చాలా సులువుగా బస్ టికెట్లను బుకింగ్ చేసుకోవచ్చు. ఇక ఈ సర్వీసులో భాగంగా తాజాగా సులభమైన ఈజీ యాక్సెస్, సులభమైన రీఫండ్‌లు, అలాగే 50 రూపాయల వరకు సూపర్ కాయిన్స్ రిడెంప్షన్ ద్వారా ఆఫర్లు ఇవ్వడం అలాగే 24 గంటలు వాయిస్ హెల్ప్ లైన్ లాంటి కీలక సేవలను ఫ్లిప్‌కార్ట్ అందించబోతోంది. ప్రస్తుతం లాంచ్ ఆఫర్ల భాగంగా సంస్థ కస్టమర్స్ కు 15% తగ్గింపుతో పాటు మరో అదనంగా 5 శాతం వరకు తగ్గింపును అందిస్తుంది. వీటితోపాటు ఫ్లిప్‌కార్ట్ యాప్ లో లక్కీ డ్రా పోటీలు కూడా నిర్వహిస్తోంది. ఇందులో ఒక రూపాయికే టికెట్లను అందించనున్నారు. ఇక ప్రముఖ పుణ్యక్షేత్రాలైన అయోధ్య, వారణాసి, హరిద్వార్, తిరుపతి ఇలాంటి ప్రదేశాలకు వెళ్లే వారికి ఫ్లాట్ 25% భారీ డిస్కౌంట్ను ఫ్లిప్‌కార్ట్ అందిస్తోంది.