మనం ఎప్పుడైనా, ఎక్కడికైనా ప్రయాణం చేయాలన్నప్పుడు రోడ్డు మార్గం లేదా రైలు మార్గాలను ఎక్కువగా ఆశ్రయిస్తుంటారు. ఇక సముద్రాల తీరాలలో ఉన్నవారు పడవ ప్రయాణాలను కూడా ఆశ్రయిస్తారు. అయితే చాలా తక్కువ మంది మాత్రమే విమాన మార్గాలను ఎంచుకుంటారు. దీని కారణం ఫ్లైట్ టికెట్ ధరలు. ఒక మనిషి ఫ్లైట్ ఎక్కి దిగాలంటే మినిమం 1000 రూపాయలైనా కట్టి టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి పేద, మధ్యతరగతి వ్యక్తులు విమాన ప్రయాణాలకు కాస్త దూరంగానే ఉంటారు. ఇకపోతే అందరికీ విమాన ప్రయాణాన్ని అందించాలన్న నేపథ్యంతో కేంద్ర ప్రభుత్వం ఉడాన్ అనే ఓ అద్భుతమైన స్కీం అమలు చేస్తోంది.
Also read: TTD : శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. ఎల్లుండి దర్శన టికెట్లు విడుదల..!
ఈ స్కీం లో భాగంగా ప్రాంతీయ విమాన సర్వీసులను ప్రోత్సహించడంతో పాటు.. సాధారణ ప్రజలకు కూడా విమాన ప్రయాణాలు అందుబాటులోకి తెచ్చేలా ఈ పథకాన్ని రూపొందించారు. 2016 అక్టోబర్ 21న కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమల్లోకి తీసుకువచ్చింది. ఈ నేపథ్యంలో కొన్ని ప్రధాన నగరాలకు సంబంధించి విమానా టికెట్ల ధరలు భారీగా తగ్గాయి. ముఖ్యంగా రీజనల్ కనెక్టివిటీ స్కీం ఆర్సిఎస్ లలో చేరే విమాన సంస్థలు కేవలం 50 నిమిషాల్లో పూర్తయ్యే ప్రయాణానికి గాను టికెట్ల ధరలను భారీగా తగ్గించాయి.
Also read:WhatsApp : వాట్సాప్ లో మరో కొత్త ఫీచర్.. స్టేటస్ కోసం..
ఇక ఈ స్కిం కింద కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ కూడా అందిస్తోంది. ఈ నేపధ్యంలో అలయన్స్ ఎయిర్లైన్స్ కేవలం రూ. 150 లకే విమాన టికెట్స్ ను అందిస్తోంది. ఈ టికెట్ ధర అస్సాం లోని లీలామరి నుండి తేజ్ పూర్ నగరాల మధ్య ఉంది. మొత్తానికి ఈ ప్రయాణ దూరం 186 కిలోమీటర్లు. 150 రూపాయలు అనేది టికెట్ బేస్ ధర. అయితే వీటిపై కన్వీనియన్స్ ఫీజు, జిఎస్టి, ఇతర అనేక టాక్స్ లు కలిపి మొత్తంగా మరో 325 కలపబడతాయి. దీంతో ఈ టికెట్ మొత్తం ఇతర రూ. 475. అయితే 186 కిలోమీటర్లకి 475 రూపాయలు పెట్టడం సమంజసమే. ఇలా విమాన చార్జీలను తక్కువ ధరలకు అందించడం నిజంగా అభినందించ విషయమే. వీటితోపాటు మరికొన్ని రూట్లలలో కూడా మనదేశంలో ఇలా తక్కువ ధరలకే విమాన ప్రయాణాలను చేయవచ్చు.