ప్రముఖ సోషల్ మీడియా మెసేజింగ్ యాప్ వాట్సాప్ తమ యూజర్స్ కోసం ప్రత్యేకమైన ఫీచర్స్ ను తీసుకొస్తుంది.. ఇప్పటివరకు ఎన్నో ప్రైవసీ ఫీచర్స్ ను అందించిన వాట్సాప్ తాజాగా మరో ఫీచర్ ని అందుబాటులోకి తీసుకొని వస్తుంది.. అదే స్టేటస్ కోసం ఈ కొత్త ఫీచర్ అలెర్ట్ ను అందిస్తుంది.. ఈ ఫీచర్ పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
వాట్సాప్ యాప్ ఒకవైపు ప్రైవసి కోసం సరికొత్త ఫీచర్స్ ను అందిస్తూనే మరోవైపు కొత్త ఫీచర్స్ ను అందుబాటులోకి తీసుకొని వస్తున్నారు.. వాట్సాప్ తీసుకొచ్చిన ఫీచర్లలో వాట్సాప్ స్టేటస్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఈ ఫీచర్‌కు ఎంతో ఆదరణ లభించింది. అయితే తాజాగా వాట్సాప్ ఈ స్టేటస్ విభాగంలో మరో కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొని వస్తున్నారు.. ఈ స్టేటస్ ఫీచర్ ఎలా పని చేస్తుందో చూద్దాం..
మన కాంటాక్ట్ లోని ఎవరైనా స్టేటస్ పెడితే అలెర్ట్ వస్తే బాగుండు అని అనుకుంటారు కదూ.. అవును ఇప్పుడు అలాంటి ఫీచర్ ఒకటి అందుబాటులోకి వచ్చేసింది. ప్రస్తుతం టెస్టింగ్ స్టేజ్‌లో ఉన్న ఈ ఫీచర్‌ను త్వరలోనే యూజర్లందరికీ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం ఏదైనా మెసేజ్ వస్తే ఎలాగైతే అప్‌డేట్ వస్తుందో ఇకపై ఎవరైనా స్టేటస్ పెట్టిన వెంటనే మిమ్మల్ని అలర్ట్ చేస్తుంది.. ఇప్పుడు కేవలం ఐఒఎస్ యూజర్స్ కు మాత్రమే అందుబాటులో ఉంటుంది.. త్వరలోనే అందరికీ అందుబాటులోకి రానుంది..