పాకిస్తాన్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ వాహనం కాలువలో పడి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యక్తులు మృతి చెందారు. ఈ ప్రమాదం.. ఖైబర్ పఖ్తున్‌ఖ్వాలోని షాంగ్లా జిల్లాలోని బర్బత్‌కోట్ ప్రాంతంలో సోమవారం జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడికక్కడే ఐదుగురు మరణించినట్లు స్థానిక మీడియా సంస్థ సమాచారం అందించింది. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న రెస్యూ సిబ్బంది.. మృతదేహాలను కాలువలో నుంచి బయటకు తీసి వారంతా ఒకే కుటుంబానికి చెందినవారుగా గుర్తించారు.
ఛత్తీస్‌గఢ్‌లోని సారన్‌గఢ్-బిలాయిగఢ్‌లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి గొడ్డలి, కత్తితో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురిని దారుణంగా చంపి, ఆ తర్వాత అతను కూడా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనకు కారణం ప్రేమ వ్యవహారం అని అంటున్నారు. ఈ దారుణ ఘటన సలీహా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. కాగా.. ఈ ఘటనతో ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా దద్దరిల్లింది.
పంజాబ్ లో న్యూ ఇయర్ వేళ విషాదం నెలకొంది. జలంధర్ జిల్లా అదంపూర్‌లోని ఒక గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యక్తులు తమ ఇంట్లో శవమై కనిపించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.