సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ అంటే నయనతార పేరు ఎక్కువగా వినిపిస్తుంది.. ఎన్నో హిట్ సినిమాలలో నటించింది.. స్టార్ హీరోల సరసన నటించడం మాత్రమే అత్యధిక రెమ్యూనరేషన్ ను కూడా అందుకుంటుంది.. ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తుంది.. ఇకపోతే ఇటీవలే తన పుట్టిన రోజు గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంది. పలువురు సినీ ప్రముఖులతో పాటు అభిమానులు, నెటిజన్లు నయన్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు..
తన పుట్టినరోజు సందర్భంగా తన భర్త విఘ్నేష్ శివన్ నుంచి ఒక ప్రత్యేక బహుమతిని అందుకుందీ లేడీ సూపర్ స్టార్. ఈ విషయాన్ని రెండు వారాల తర్వాత సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు విఘ్నేష్ శివన్- నయనతార. ఇంతకు నయన్‌కు అందిన పుట్టిన రోజు గిఫ్ట్ ఏంటో తెలుసా? రూ. 3 కోట్లు విలువ చేసే జర్మన్ లగ్జరీ కారు మెర్సిడెస్ బెంజ్. తాజాగా ఈ కారుకు సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన నయన్ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ‘వెల్కమ్ హోమ్ యూ బ్యూటీ అంటూ.. మై డియర్ హస్బెండ్, ఈ పుట్టిన రోజున మర్చిపోలేని గిఫ్ట్ ను ఇచ్చారు అంటూ పోస్ట్ లో పేర్కొన్నారు..
ఇకపోతే మెర్సిడెస్కారు ప్రారంభ ధర రూ.2.69 కోట్లు కాగా నయన్ అందుకున్న కారు సుమారు రూ. 3.40 కోట్ల రూపాయల వరకు ఉంది. ఈ కారులో అనేక విలాసవంతమైన ఫీచర్లు ఉన్నాయి. నయనతార, విఘ్నేష్ శివన్ చాలా ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఆ తర్వాత 2022 జూన్ 22న వివాహం చేసుకున్నారు. ఆపై అక్టోబర్‌లో అద్దె గర్భం ద్వారా కవలలకు జన్మనిచ్చారీ లవ్లీ కపుల్. వారికి ఉయిర్, ఉలగమ్ అని నామకరణం చేశారు. కాగా ఈ ఏడాది పుట్టిన రోజు నయనతారకు చాలా ప్రత్యేకం. షారుఖ్ ఖాన్, నయనతార జంటగా నటించిన ‘జవాన్’ విడుదలై సూపర్ హిట్ అయింది.. ఈ సినిమా తర్వాత పలు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.. మొత్తానికి ఈ అమ్మడు బిజిబిజీగా గడుపుతుంది..