Bihar: బీహార్లో కాల్పుల కలకలం.. బీజేపీ నేత సహా ఇద్దరు హత్య
- బీహార్లో కాల్పులు కలకలం
- ముంగేర్ జిల్లాలో 24 గంటల్లోనే నాలుగు భారీ ఘటనలు
- ఈ ఘటనలో బీజేపీ నేతతో సహా ఇద్దరు వ్యక్తులు మృతి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీహార్లో కాల్పులు కలకలం సృష్టించాయి. ఉపముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి సొంత జిల్లా ముంగేర్ జిల్లాలో 24 గంటల్లోనే దుండుగులు నాలుగు భారీ ఘటనలకు పాల్పడ్డారు. ఈ ఘటనలో బీజేపీ నేతతో సహా ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మృతుడు బీజేపీ నగర అధ్యక్షుడు ఫంతుష్ కుమార్ అలియాస్ బంటీ సింగ్ గా గుర్తించారు. బీజేపీ నాయకుడు తన కుమారుడితో కలిసి నిద్రిస్తున్న సమయంలో దుండగులు కాల్చారని స్థానికులు చెబుతున్నారు. ఉదయం మంచంపై పడి ఉన్న మృతదేహాన్ని చూసి చలించిపోయామని చెప్పారు. కచ్చి కన్వారియా బాటలో బీజేపీ నేత టీ-స్నాక్‌ల దుకాణం నడిపేవారని ప్రజలు తెలిపారు. అయితే.. ఈ ఘటనకు పాల్పడింది ఎవరు, కారణం ఏమై ఉంటుందని పోలీసులు విచారిస్తున్నారు.
Read Also: Sachin Tendulkar: మీరు మా హృదయాల్లో చోటు సంపాదించుకున్నారు.. ప్రీతి, నిషాద్‌లకు సచిన్ అభినందనలు
Also Read
- Off The Record: కూటమి ప్రభుత్వం వచ్చాక పెద్దిరెడ్డి కుటుంబం సైలెంట్.. అసలు కారణాలేంటి ?
- Surya Kumar Yadav: టీ20 వరల్డ్ కప్ తెచ్చాడన్న కనికరం కూడా లేదు.. పాపం సూర్యకుమార్ యాదవ్ పరిస్థితి దారుణం..
- West Bengal: కాలేజీలో డబ్బు, గన్స్, కండోమ్లు.. బెంగాల్లో రాజకీయ దుమారం..
- Donga Police: ఒకడేమో పోలీస్.. మరొకడు పోలీస్ అవతారమెత్తాడు.. సీన్ కట్ చేస్తే..!
మరోవైపు.. ధర్హరా, ఖాసిం బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో మరోఇద్దరిపై కాల్పులు జరిపారు. దీంతో.. వారు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను మెరుగైన వైద్యం కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో.. ఆ ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి. కాగా.. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై విచారణ చేపట్టామని.. కొంత మందిని విచారించాల్సి ఉందని తెలిపారు. హత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. హంతకుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
Read Also: Saripodhaa Sanivaaram: నాని ‘సరిపోదా’ను సరిపెడుతున్న భారీ వర్షాలు??
మరో ఘటనలో బౌచాహి గ్రామం సమీపంలో బొలెరో డ్రైవర్ తలపై గుర్తు తెలియని దుండుగులు కాల్చి చంపారు. అనంతరం.. NH 80లో రోడ్డు పక్కన పడేసి వెళ్లిపోయారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతుడు బొలెరో డ్రైవర్ బెగుసరాయ్ జిల్లా మతిహాని ప్రాంతానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు.
తాజావార్తలు
-
Neem Juice Daily : వేప రసం మంచిదే.. కానీ రోజూ తాగితే ఈ ప్రమాదాలు తప్పవు.!
-
Off The Record: కూటమి ప్రభుత్వం వచ్చాక పెద్దిరెడ్డి కుటుంబం సైలెంట్.. అసలు కారణాలేంటి ?
-
Surya Kumar Yadav: టీ20 వరల్డ్ కప్ తెచ్చాడన్న కనికరం కూడా లేదు.. పాపం సూర్యకుమార్ యాదవ్ పరిస్థితి దారుణం..
-
West Bengal: కాలేజీలో డబ్బు, గన్స్, కండోమ్లు.. బెంగాల్లో రాజకీయ దుమారం..
-
Donga Police: ఒకడేమో పోలీస్.. మరొకడు పోలీస్ అవతారమెత్తాడు.. సీన్ కట్ చేస్తే..!
ట్రెండింగ్
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!