Gun Fire : అమెరికాలోని కెంటకీలోని ఓ ఇంట్లో శనివారం జరిగిన కాల్పుల్లో నలుగురు మృతి చెందగా, మరో ముగ్గురు గాయపడ్డారు. కాల్పులు జరిపిన నిందితుడు ఆ తర్వాత తన ఇంటి నుంచి పారిపోతుండగా హతమైనట్లు పోలీసులు తెలిపారు. అనుమానాస్పద దాడి చేసిన వ్యక్తి కారును పోలీసులు వెంబడించారు. ఈ సమయంలో అనుమానితుడి కారు కాలువలో పడింది. ఈ ప్రమాదంలో అతడు మరణించాడని పోలీసులు ప్రకటించారు.
Read Also:Dengue Symptoms: డెంగ్యూ వ్యాధి లక్షణాలు ఇవే.. మీరూ ఒకసారి చెక్ చేసుకోండి..?
తెల్లవారుజామున 2:50 గంటలకు పోలీసులు ఫ్లోరెన్స్‌లోని ఒక ఇంటికి చేరుకున్నప్పుడు, ఏడుగురిపై కాల్పులు జరిగినట్లు నగర పోలీసు విభాగం తెలిపింది. కాల్పుల్లో నలుగురు అక్కడిక్కడే మృతి చెందినట్లు తెలిపారు. పరిస్థితి విషమంగా ఉన్న ముగ్గురు వ్యక్తులను సిన్సినాటిలోని ఆసుపత్రిలో చేర్చినట్లు వారు చెప్పుకొచ్చారు.
Read Also:Joe Biden: “దేవుడు మాత్రమే నన్ను అధ్యక్ష ఎన్నికల నుంచి తప్పించగలడు”
నిందితుడు కారులో పారిపోతుండగా అదుపుతప్పి గుంతలో పడిపోయిందని పోలీసులు తెలిపారు. ఇంటి యజమాని కుమారుడి బర్త్ డే పార్టీకి జనం వచ్చారని పోలీసులు చెప్పారు. ఈ కాల్పుల్లో ఇంటి యజమాని ప్రాణాలు కోల్పోయాడు. దర్యాప్తులో 20 ఏళ్ల నిందితుడికి పార్టీకి వచ్చిన వ్యక్తుల గురించి ముందే తెలుసునని, అయితే అతడిని ఆహ్వానించలేదని తెలుస్తోంది. దేశవ్యాప్తంగా ఏం జరుగుతుందో తనకు తెలుసునని అయితే ఫ్లోరెన్స్‌లో భారీ కాల్పులు జరగడం ఇదే తొలిసారి అని పోలీసులు అన్నారు.