వైటాలిటీ బ్లాస్ట్ లో సోమర్‌సెట్ బౌలర్ రోల్ఫ్ వాన్ డెర్ మెర్వే బౌలింగ్ వేసేటప్పుడు అతని వేలికి గాయమైంది. బాలు వేసిన వెంటనే అతనివైపు రావడంతో.. దాన్ని ఆపే క్రమంలో బంతి అతని వేలికి తాకుతుంది. వెంటనే మెర్వ్ నొప్పితో గంతులేస్తాడు. అంతేకాకుండా అతని వేలు మెలితిరిగి పోయింది. వెంటనే ఫిజియో స్టేడియంలోకి వచ్చి వేలు లాగుతాడు. అయినప్పటికీ.. మార్వ్ మళ్లీ బౌలింగ్ చేయడానికి ఎక్కువ సమయం తీసుకోలేదు.