Promotions: శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఆ ఉద్యోగుల ప్రమోషన్లకు గ్రీన్‌సిగ్నల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమరావతిలో సచివాలయ, వార్డు వ్యవస్థలో పనిచేస్తున్న వివిధ కేటగిరీల ఉద్యోగుల పదోన్నతులకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. క్యాబినెట్ ఆమోదంతో పదోన్నతి ఛానెల్స్‌పై ప్రభుత్వం అధికారికంగా జీవోను జారీ చేసింది. ఈ నిర్ణయంతో వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీలు, వార్డు డేటా ప్రాసెసింగ్ సెక్రటరీలు, వార్డు శానిటేషన్, ఎన్విరాన్మెంట్ సెక్రటరీలు (గ్రేడ్-II), అలాగే వార్డ్ ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీ పోస్టుల వారికి ప్రమోషన్లు లభించనున్నాయి.
వార్డుల్లో ఖాళీగా ఉన్న, మిగిలి ఉన్న పోస్టులను క్రమబద్ధీకరించడం ద్వారా కొత్తగా 815 జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ కొత్త పోస్టుల్లో అర్హులైన వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీలకు పదోన్నతులు కల్పిస్తారు. ఈ ప్రమోషన్ల ద్వారా ఖాళీ అయ్యే వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ పోస్టులను వార్డు డేటా ప్రాసెసింగ్ సెక్రటరీల పదోన్నతులతో భర్తీ చేస్తారు.
Also Read
- Brave Head Constable: తమిళనాడులో రెచ్చిపోయిన గుట్కా ముఠాలు.. సినిమా రేంజిలో ఛేజింగ్..
- Bill Gates: ‘ఏఐతో బిలియన్ల మరణాలు సంభవించవచ్చు’..
- Congress: మోడీ గెలిచిన వారణాసిలో రీపోలింగ్ నిర్వహించాలి.. యూపీ కాంగ్రెస్ చీఫ్ డిమాండ్..
- Virat Kohli: "ఆ ఓటమి నన్ను లోపలి నుంచి కుంగదీసింది".. విరాట్ కోహ్లీ ఎమోషనల్..
అదేవిధంగా.. వార్డు శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీ, వార్డు ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీ క్యాడర్లలోని 815 పోస్టులను గ్రేడ్-II నుండి గ్రేడ్-I కి అప్‌గ్రేడ్ చేసేందుకు ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. దీనివల్ల ఈ రెండు కేటగిరీలలో కలిపి మొత్తం 1630 మంది ఉద్యోగులకు ప్రమోషన్లు రానున్నాయి. పురపాలక ఉద్యోగుల అనుభవం, వారు అందిస్తున్న సేవలకు తగిన గుర్తింపు ఇచ్చేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు.
ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు అందే సేవలను మరింత బలోపేతం చేస్తుందని ఆయన పేర్కొన్నారు. అలాగే అధికారుల కమిటీ నుంచి సిఫార్సులు అందిన వెంటనే మిగిలిన మరో రెండు కేటగిరీల ఉద్యోగుల పదోన్నతులకు సంబంధించిన నిబంధనలు కూడా త్వరలోనే జారీ చేస్తామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Promotions: శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఆ ఉద్యోగుల ప్రమోషన్లకు గ్రీన్‌సిగ్నల్..
-
Brave Head Constable: తమిళనాడులో రెచ్చిపోయిన గుట్కా ముఠాలు.. సినిమా రేంజిలో ఛేజింగ్..
-
CM Revanth Reddy : శ్వేతపత్రం విడుదల చేశాకే సిరిసిల్లలో అడుగుపెట్టాలి
-
LPU Students Protest: LPUలో స్టూడెంట్స్ రచ్చ.. రేప్ ఆరోపణలతో వర్సిటీలో విధ్వంసం..
-
Bill Gates: ‘ఏఐతో బిలియన్ల మరణాలు సంభవించవచ్చు’..
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?