Thread Tied To Boy Private Part: ఢిల్లీలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో దారుణం చోటు చేసుకుంది. ఎనిమిదేళ్ల విద్యార్థి మర్మాంగానికి సీనియర్లు నైలాన్ దారం కట్టారు. బాలుడిని స్నానానికి తీసుకెళ్లగా కుటుంబ సభ్యులు మర్మాంగానికి దారం ఉన్న విషయాన్ని గుర్తించారు. వెంటనే ఆ బాలుడిని ఆస్పత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు నిర్వహిస్తున్నారు. ఈ పనికి పాల్పడిన విద్యార్థులను బాలుడు గుర్తించలేకపోతున్నాడు. కిద్వాయ్ నగర్‌లోని న్యూ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎన్‌డిఎంసి) పాఠశాలలోని కొందరు విద్యార్థులు రెండో తరగతి చదువుతున్న ఓ విద్యార్థి మర్మాంగాన్ని నైలాన్ దారంతో బిగించారు.
Read Also: Russia New Year Gift : రష్యా న్యూ ఇయర్ గిఫ్ట్.. వారికి ఆదాయపన్ను లేనట్లే
బాలుడు అలానే ఇంటికి రాగా.. తల్లిదండ్రులు స్నానం చేయించే సమయంలో గుర్తించారు. ఈ ఘటన బుధవారం వెలుగులోకి రాగా.. బాలుడిని ఆసుపత్రికి తరలించామని అక్కడ వైద్యుల అబ్జర్వేషన్‌లో ఉంచామని పోలీసులు తెలిపారు. అనంతరం ఈ చర్యకు పాల్పడిన విద్యార్థులను గుర్తించి.. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు బాధిత విద్యార్థిని పాఠశాలకు తీసుకెళ్లారు. అయితే వారిని ఆ బాలుడు గుర్తించలేకపోయాడని పోలీసులు తెలిపారు. మరోసారి బాలుడిని పాఠశాలకు తీసుకువెళ్లి నిందితులైన విద్యార్థులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు సౌత్ ఢిల్లీ పోలీసులు. చిన్నారి పరిస్థితి బాగానే ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అయితే కాసేపు డాక్టర్ల పర్యవేక్షణలోనే బాలుడిని ఉంచారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత.. పోలీసులు అతనిని తమతో పాటు పాఠశాలకు తీసుకెళ్లారు. ఈ కేసులో విచారణ ఇంకా కొనసాగుతోంది.