Restrictions On Media: ఇజ్రాయెల్- హమాస్‌ల మధ్య యుద్ధం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో టెల్‌అవీవ్ సంచలన నిర్ణయం తీసుకుంది. గాజాతో యుద్ధంలో పాల్గొంటున్న తమ సైనికులు విచారణను ఎదుర్కొనే ఛాన్స్ ఉండటంతో.. మీడియాపై ఆంక్షలు పెట్టింది.
నేడు హౌతీ రెబల్స్ ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్‌పై క్షిపణితో దాడి చేశారు. అయితే, ఆ క్షిపణిని అడ్డుకోవడంలో తాము ఫెయిల్ కావడంతో 14 మందికి తీవ్ర గాయాలైనట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ చెప్పుకొచ్చింది.
Israel-Hezbollah: హెజ్‌బొల్లా ఉగ్రవాద సంస్థ ప్రధాన ఆఫీసు అధిపతి సోహిల్ హొసైన్ హొసైనీని ఇజ్రాయెల్ ఐడీఎఫ్ హతమర్చినట్లు ఈరోజు (మంగళవారం) ప్రకటించింది. సోమవారం ఇంటెలిజెన్స్ విభాగం అందించిన ఖచ్చితమైన సమాచారంతో వైమానిక దళం దాడులు కొనసాగించింది.
Israel-Hezbollah War: హెజ్‌బొల్లాపై ఇజ్రాయెల్ దాడి కొనసాగుతుంది. ఈ తరుణంలో బీరుట్‌లోని దాహియాతో పాటు పొరుగుప్రాంత ప్రజలు తమ ఇళ్లను వదిలి పెట్టి వెళ్లాలని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ హెచ్చరికలు జారీ చేసింది.
హమాస్‌పై యుద్ధంతో ఇరాన్ మద్దతు గల సంస్థ హిజ్బుల్లా సోమవారం నాడు అర్థరాత్రి ఇజ్రాయెల్‌పై 35 రాకెట్లతో దాడి చేసింది. ఇజ్రాయెల్ ఆర్మీ ప్రధాన కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని దాడి చేసినట్లు హిజ్బుల్లా పేర్కొంది.
గత కొద్ది రోజులుగా గాజాపై ఇజ్రాయిల్ యుద్ధం సాగిస్తోంది. ఇప్పటికే వేలాది భవనాలు నేలమట్టం అయ్యాయి. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. అనేక మంది ప్రాణాలు కోల్పోయారు.