Road Accident : సూర్యాపేట జిల్లా నేరేడుచర్లలో ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. హుజూర్ నగర్ – మిర్యాల గూడ జాతీయ రహదారి పై బైకు లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే చనిపోయారు. నేరేడుచర్ల మున్సిపాల్టీ పరిధి లోని రామాపురానికి చెందిన సత్యనారాయణ అనే వ్యక్తి కుటుంబ సభ్యులతో కలిసి బైక్ పై మిర్యాలగూడ వెళ్తున్నారు. రామగిరి వద్ద లారీని బైక్ ఢీకొట్టడంతో సత్యనారాయణ అతడి కుమారుడు అక్కడికక్కడే చనిపోయారు. ఆయన భార్యకు తీవ్రగాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Read Also: Pushpa 2 : అక్కడ ఇక్కడ ఒకే సారి తగ్గేదేలే.. అంటున్న అల్లు అర్జున్
ఇదిలా ఉంటే.. రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్ మండలం పెద్దషాపూర్ తండా వద్ద ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకొచ్చిన గుర్తుతెలియని వాహనం అదుపుతప్పి బైకును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను గోపాల్(47), అంజలి(42), స్వాతి(09)గా గుర్తించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.