Shivam Dubey : శివమ్ దూబే గొప్ప క్రికెటర్‌గా ఎదుగుతున్నాడంటే తన తండ్రి చేసిన త్యాగం అతడిని ఈ స్థాయిలో నిలబెట్టింది. అతని ప్రస్తుతం వయసు 25 ఏళ్లు మాత్రమే. అతను భారత్ తరఫున కొన్ని మ్యాచ్‌లు కూడా ఆడాడు, కానీ జట్టులో స్థిరమైన స్థానాన్ని సంపాదించడంలో విఫలమయ్యాడు. అతను భారత్ తరపున ఒక వన్డే, 13 టీ20 మ్యాచ్‌లలో వరుసగా 9 మరియు 105 పరుగులు చేశాడు.
Read Also: Rohit Sharma: ‘మేం వచ్చేస్తాం.. పదండి ఉప్పల్‌కు’ అంటున్న రోహిత్ శర్మ
కొడుకు క్రికెటర్ కావాలని చిన్నతనంలోనే తన తండ్రి కలలు కన్నాడని దూబే ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. శివమ్‌కి శిక్షణ ఇచ్చే బాధ్యతను తన భుజంపై వేసుకుని రోజూ గంటల తరబడి ప్రాక్టీస్ చేసేలా చేశాడు. అతను సుమారు 10 సంవత్సరాల పాటు సాధన చేశాడు. 14 సంవత్సరాల వయస్సు నుండి, శివమ్ ముంబైలోని కోచ్ చంద్రకాంత్ పండిట్ వద్ద కోచింగ్ తీసుకున్నాడు. శివం తండ్రి జీన్స్ వ్యాపారం చేసేవాడు. కొడుకును క్రికెటర్‌గా మార్చేందుకు తన తండ్రి వ్యాపారాన్ని కూడా అమ్మేశారని శివమ్ చెప్పాడు. శివంది ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, అయితే కొన్నేళ్ల క్రితమే అతని కుటుంబం ఉత్తరప్రదేశ్‌ను విడిచిపెట్టి మహారాష్ట్రకు మారింది.
Read Also:BCCI: క్రికెటర్లకు గుడ్ న్యూస్.. ప్రైజ్ మనీ డబుల్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs చెన్నై సూపర్ కింగ్స్ (RCB vs CSK) మధ్య జరిగిన మ్యాచ్‌లో యువ ఆటగాడు శివమ్ దూబే అద్భుత ప్రదర్శన చేశాడు. ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 8 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై 226 పరుగులు చేసింది. ఆర్సీబీపై దూబే 27 బంతుల్లో 52 పరుగులతో భీకర ఇన్నింగ్స్ ఆడాడు. అతని ఇన్నింగ్స్‌లో 2 ఫోర్లు, 5 సిక్సర్లు బాదాడు. ఐపీఎల్లో అతనికిది నాలుగో హాఫ్ సెంచరీ.