ఆదిభట్ల ఔటర్ రింగ్ రోడ్డు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. వేగంగా ఢీకొట్టడంతో కారు నుజ్జునుజ్జు అయ్యింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు మృతిచెందగా మరొకరు తీవ్రంగా గాయపడి సీరియస్ గా ఉన్నట్లు సమాచారం. అటుగా వెళ్తున్న ప్రయాణికులు పోలీసులకు సమాచారం అందించడంతో వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు ప్రారంభించారు. కారులో ఇరుక్కుపోయిన వారిని బయటకు తీసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఔటర్ రింగ్ రోడ్…