భారత దేశంలో ప్రయాణీకులను గమ్య స్థానాలకు చేరవేయడానికి రైల్వే సంస్థ ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ముంబై, హైదరాబాద్, ఢిల్లీ బెంగళూరు వంటి మెట్రో నగరాల్లో ప్రజలకు ప్రయాణాన్ని సౌకర్యవంతం చేస్తూ మెట్రో సంస్థ తమ సేవలను అందిస్తోంది. అయితే ఇప్పుడు మెట్రో మరో ముందుడుగు వేసింది. నీటి అడుగున కూడా నడవనుంది. లండన్, ప్యారిస్ తరహాలో ఇండియాలో కూడా త్వరలో నీటి అడుగున మెట్రో నడవబోతుంది. మన దేశంలోనే తొలి నీటి అడుగున మెట్రో సర్వీస్ త్వరలో ప్రారంభం కానుంది. ఇప్పటికే అండర్ వాటర్ ట్రైన్స్ టెస్ట్ కూడా చేస్తున్నారు. ఈ ట్రైల్స్ విజయవంతం అయిన తర్వాత ప్రారంభించనున్నారు.
Also Read : Karnataka Elections: అభ్యర్థులను నేడు ఖరారు చేయనున్న బీజేపీ.. జేపీ నడ్డా నివాసంలో సమావేశం.
భారత్ దేశంలోనే తొలి నీటి అండర్ గ్రౌండ్ లో నడిచే మెట్రో ట్రైన్ కోత్ కతాలో ప్రారంభం కానుంది. ఇలా మెట్రో ట్రైన్ లో నీటి లోపల ప్రయాణిస్తూ వారు మాల్దీవుల్లో ఉన్న అనుభూతిని పొందే అవకాశం ఉంది. కోల్ కతాలోని హుగ్లీ నదిలో నిర్మించిన సొరంగం ద్వారా మొదటి నీటి అడుగున మెట్రో వెళ్తుంది. ఇందులో ఆరు బోగీలు ఉంటాయి. ఈ మెట్రో రైలు స్పెషల్ ఏమిటంటే.. పరీక్ష తర్వాత సర్వీస్ ప్రారంభం కోల్ కతా ఈస్ట్ వెస్ట్ మెట్రో ప్రాజెక్ట్ కింద 6 కోచ్ ల రెండు మెట్రో లను టెస్టింగ్ చేయనుంది. ఈ మెట్రో ట్రైన్ ట్రయల్ ఎస్ప్లా నేడ్-హౌరా గ్రౌండ్ మధ్య 4.8 కిలోమీటర్ల దూరంలో జరుపనున్నారు.
Also Read : Jupally krishna rao: కొల్లాపూర్ ఎమ్మెల్యే పై జూపల్లి తీవ్ర ఆరోపణ..
దేశంలోనే తొలి మెట్రో ట్రైన్ 1984లో కోల్ కతాలో మొట్టమొదటి సర్వీస్ ప్రారంభమైంది. అనంతరం 2002లో ఢిల్లీలో రెండో మెట్రో సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు చాలా నగరాల్లో మెట్రో సేవలు స్టార్ట్ అవుతున్నాయి. ఇప్పుడు కోల్ కతాలోనే తొలి నీటి అడుగున నడిచే మెట్రోను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. డిసెంబర్ నాటికి పనులు పూర్తవుతాయి. మొట్టమొదటి నీటి అడుగున మెట్రో రైల్ సేవలు ఈ సంవత్సరం డిసెంబర్ నుంచి ప్రారంభం కానుంది అని KMRC( కోత్ కతా మెట్రో రైల్ కార్పొరేషన్ ) పేర్కొంది. దీనికి సంబంధించిన పనులు ఇంకా కొనసాగుతున్నాయని.. వాటిని త్వరలోనే పూర్తి చేస్తామని చెప్పారు.
Also Read : Ponniyin Selvan 2: రెహమాన్ కంపోజిషన్ కి సలాం కొట్టాల్సిందే
లండన్, ప్యారిస్ తరహాలో మెట్రో ట్రైన్ భారతదేశపు మొట్టమొదటి నీటి అడుగున మెట్రో రైల్ లండన్-పారిస్ తరహాలో నడపనున్నారు. ఈ నీటి అడుగున మెట్రో ట్రైన్ లండన్ లోని యూరోస్టార్ తో పోలుస్తారు. నీటి అడుగున రైలు ప్రారంభమైతే లక్షల మంది ప్రయాణికులకు ట్రాఫిక్ సమస్య నుంచి ఉపశమనం లభించనుంది. రూ. ఈ మెట్రో టెన్నెల్ నిర్మాణానికి దాదాపు 120 కోట్ల రూపాయలు వెచ్చించనున్నారు. అంతేకాదు. హౌజ్ ఖాస్ తర్వాత.. కోల్ కతాలోని హౌరా స్టేషన్ గరిష్టంగా 33 మీటర్ల లోతుగా ఉంటుంది. ప్రస్తుతం.. హౌజ్ ఖాస్ 29 మీటర్ల వరకు లోతైన స్టేషన్ గా పరిగణించబడుతుంది.