IND vs AUS: ప్రాక్టీస్‌లో చెమటోడ్చుతున్న టీమిండియా ఆటగాళ్లు.. అభిమానులు చెట్లు ఎక్కి..!
- నవంబర్ 22న ఆస్ట్రేలియాతో టీమిండియా టెస్టు మ్యాచ్
- పెర్త్‌లో నెట్స్‌లో కఠినమైన ప్రాక్టీస్ చేసిన భారత్
- WACA స్టేడియంలో ప్రతిరోజూ గంటల తరబడి నెట్ ప్రాక్టీస్
- విరాట్ కోహ్లి ప్రాక్టీస్ ను చెట్లక్కి చూసిన అభిమానులు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నవంబర్ 22న ఆస్ట్రేలియాతో ప్రారంభం కానున్న టెస్టు మ్యాచ్ కోసం టీమిండియా పెర్త్‌లో నెట్స్‌లో కఠినమైన ప్రాక్టీస్ చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ మినహా జట్టు సభ్యులందరూ ఆస్ట్రేలియా చేరుకున్నారు. వ్యక్తిగత కారణాలతో రోహిత్ తొలి టెస్టుకు దూరం కానున్నాడు. బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్, అసిస్టెంట్ కోచ్‌లు ర్యాన్ టెన్ డోస్చాట్, అభిషేక్ నాయర్ పర్యవేక్షణలో బుధవారం పెర్త్‌లో జరిగిన ప్రాక్టీస్ సెషన్‌కు మొత్తం జట్టు హాజరయ్యారు. WACA స్టేడియంలో ప్రతిరోజూ గంటల తరబడి నెట్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ సమయంలో సీనియర్ ఆటగాళ్లు విరాట్ కో, జస్ప్రీత్ బుమ్రా చాలా తీవ్రంగా ప్రాక్టీస్ చేయడం కనిపించింది.
Read Also: Leopard-Lion fight: పిల్లలను కాపాడుకునేందుకు సింహంతో తల్లి చిరుతపులి ఫైటింగ్.. చివరికి ఏమైందంటే..!
Also Read
- Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్... సబ్బులు, బాడీ వాష్‌లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
- Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
- Pakistan: గర్భిణీలు, చిన్న పిల్లల్ని కూడా వదల్లేదు.. POKలో పాక్ ఆర్మీ దుర్మార్గాలు..
- Off The Record: అధికారం కోసం తప్ప పార్టీ కోసం ఎవరూ పని చేయట్లేదా..? ఆ ఉమ్మడి జిల్లా జనసేన కమిటీ మొత్తం రద్దు..
అయితే.. విరాట్ కోహ్లి ప్రాక్టీస్ చేస్తున్నారని తెలుసుకున్న అభిమానులు అతడిని చూడాలని అక్కడికి వచ్చారు. చాలా మంది అభిమానులు అతనిని చూడటానికి నిచ్చెన తెచ్చుకుని మరి.. చెట్లెక్కి కోహ్లీ ప్రాక్టీస్ చేయడం చూశారు. కాగా.. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. మరోవైపు.. విడుదల చేసిన వీడియోలో వార్మప్ సెషన్ తర్వాత ఆటగాళ్లు బౌలింగ్ చేయడం, మరియు బ్యాటింగ్ చేయడం చూడవచ్చు. బౌలర్లు బౌలింగ్ బౌన్సర్లను ప్రాక్టీస్ చేయగా.. బ్యాట్స్‌మెన్ షార్ట్ బాల్ ఆడుతూ ప్రాక్టీస్ చేశారు. విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ సహా బ్యాట్స్‌మెన్ అంతా షార్ట్ బాల్ ఆడుతూ కనిపించారు. అదే సమయంలో.. హర్షిత్ రాణా, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ బౌన్సీ వికెట్‌ను పూర్తిగా ఉపయోగించుకోవడం కనిపించింది.
First look at Virat Kohli at the Perth nets ahead of the Test series opener 🏏
Some fans went the extra mile to catch a glimpse of the King 👀#AUSvIND pic.twitter.com/pXDEtDhPeY
— Fox Cricket (@FoxCricket) November 14, 2024
Read Also: Bangladesh: 90 శాతం మంది ముస్లింలు.. రాజ్యాంగం నుంచి ‘‘సెక్యులర్’’ని తొలగించాలి..
తాజావార్తలు
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్‌లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్‌కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!