ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ బాలల దినోత్సవాన్ని (చిల్డ్రన్స్ డే) జరుపుకున్నారు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ కోసం టీమిండియా ఆటగాళ్లు ఆస్ట్రేలియాకు వెళ్లిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో.. గురువారం విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ తన కొడుకు ఆకాయ్, కూతురు వామికతో కలిసి బాలల దినోత్సవాన్ని జరుపుకున్నారు. అందుకు సంబంధించిన ఫోటోను దంపతులిద్దరూ సోషల్ మీడియాలో షేర్ చేశారు.
నవంబర్ 22న ఆస్ట్రేలియాతో ప్రారంభం కానున్న టెస్టు మ్యాచ్ కోసం టీమిండియా పెర్త్‌లో నెట్స్‌లో కఠినమైన ప్రాక్టీస్ చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ మినహా జట్టు సభ్యులందరూ ఆస్ట్రేలియా చేరుకున్నారు. వ్యక్తిగత కారణాలతో రోహిత్ తొలి టెస్టుకు దూరం కానున్నాడు. బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్, అసిస్టెంట్ కోచ్‌లు ర్యాన్ టెన్ డోస్చాట్, అభిషేక్ నాయర్ పర్యవేక్షణలో బుధవారం పెర్త్‌లో జరిగిన ప్రాక్టీస్ సెషన్‌కు మొత్తం జట్టు హాజరయ్యారు. WACA స్టేడియంలో ప్రతిరోజూ గంటల తరబడి నెట్…