Tanuku: ఏటీఎంలో నకిలీ నోట్లు డిపాజిట్ చేసేందుకు యత్నం.. కట్‌చేస్తే..
- నకిలీ కరెన్సీ చలామణి చేస్తున్న అయిదుగురు అరెస్టు
- తణుకు ఎస్బీఐ సీడీఎంలో జమ చేసేందుకు ప్రయత్నం
- రూ. 1.67 లక్షల నకిలీ కరెన్సీ నోట్లు స్వాధీనం
- మీడియా సమావేశంలో తాడేపల్లిగూడెం డీఎస్పీ విశ్వనాథ్
- మరో ముగ్గురిని అరెస్టు చేయాల్సి ఉందని వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నకిలీ కరెన్సీ నోట్లు చలామణి చేస్తున్న అయిదుగురు వ్యక్తులను తణుకు అరెస్టు చేశారు. తణుకు ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ వద్ద సీడీఎం మెషీన్లో జమ చేయడంతో గుట్టు రట్టయ్యింది. ఈ ఘటనలో మరో ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేయాల్సి ఉంది. పాలకొల్లు మండలం ఉల్లంపర్రు గ్రామానికి చెందిన అడబాల ఆంజనేయమూర్తి, పోడూరు మండలం జిన్నూరు గ్రామానికి చెందిన జుత్తిగ నాగరాజు, యలమంచిలి మండలం కాజ గ్రామానికి చెందిన దిగుమర్తి ఏసు, బీమవరం మండలం యల్లమెల్లిపురం గ్రామానికి చెందిన తోట రామచంద్రరావు, తణుకు ఎన్జీవో కాలనీకు చెందిన పినిశెట్టి చక్రధర్‌లను
అరెస్టు చేసి వారి వద్ద 1,67,600 విలువైన 200 నోట్లు 838 స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు మంగళవారం తాడేపల్లిగూడెం డీఎస్పీ డి.విశ్వనాథ్ వెల్లడించారు.
READ MORE: MP CM Ramesh: “ఎంపీగా గ్రామానికి ఏం చేశావ్”.. సీఎం రమేష్, సీఎం సురేష్‌పై సొంత గ్రామస్థులు ఆగ్రహం..
Also Read
- Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్‌లు ఇదిగో..!
- AIIMS: మరో రెండు ఎయిమ్స్‌లు మంజూరు చేయాలి.. కేంద్రానికి ఎంపీ లింగమనేని రమేశ్ విజ్ఞప్తి!
- YCP vs TDP: బెజవాడలో ఉద్రిక్తత.. వైసీపీ దీక్షా శిబిరం టెంట్ తొలగించిన టీడీపీ శ్రేణులు!
- Tarun Tejpal: భారత మీడియాను ఊపేసిన కేసులో క్లైమాక్స్.. ‘తెహల్కా’ వ్యవస్థాపకుడికి హైకోర్టులో బిగ్ షాక్..
తణుకు పట్టణంలోని ఎన్జీవో కాలనీకు చెందిన పినిశెట్టి చక్రధర్ గత నెల 15న స్థానిక ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ వద్ద సీడీఎం ద్వారా తన ఖాతాలోకి రూ. 200 నోట్లు మొత్తం రూ. 16,600 నగదును జమ చేశాడు. అయితే నగదు జమ కాకపోడంతో అదే నెల 21న బ్యాంకు మేనేజర్‌కు ఫిర్యాదు చేశాడు. మరుసటి రోజున బ్రాంచ్ మేనేజర్ విరోతి సోమశేఖర్‌తో కలిసి సిబ్బంది సీడీఎం మెషీన్ తెరచి చూడగా జమ చేసేందుకు ప్రయత్నించి 83 నోట్లు జమ కాకపోగా అక్కడే ఇరుక్కున్నాయి. దీంతో అనుమానం వచ్చి పరిశీలించగా నకిలీ కరెన్సీ అని తేలడంతో తణుకు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తణుకు పట్టణ సీఐ ఎన్.కొండయ్య ఆధ్వర్యంలో పట్టణ ఎస్సై కె.ప్రసాద్ ఒక బృందాన్ని ఏర్పాటు చేసుకుని సాంకేతిక సమాచారంతో దర్యాప్తు చేపట్టారు.
READ MORE: IPL 2025 Winner: అందరి అంచనాలు ఆ టీం వైపే.. చివరికి AI కూడా..!
ఈ దర్యాప్తులో పాలకొల్లు మండలం ఉల్లంపర్రు గ్రామానికి చెందిన అడబాల ఆంజనేయులు గత 30 ఏళ్లుదదా నకిలీ కరెన్సీ చలామణి చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా సుమారు 25 కేసుల్లో ముద్దాయిగా గుర్తించి అతని వద్ద నుంచి మిగిలినవారికి సరఫరా చేస్తూ మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. ఆంజనేయులు తనకు బృందంగా ఏర్పాటు చేసుకున్న జుత్తిగ నాగరాజు, దిగుమర్తి ఏసు, తోట రామచంద్రరావు, పినిశెట్టి చక్రధర్లతో నకిలీ కరెన్సీ చలామణి చేయిస్తున్నట్లుగా నిర్థారించారు. వీరితో పాటు మరో ముగ్గురిని అరెస్టు చేయాల్సి ఉండగా వీరు వివిధ కేసుల్లో జైలు శిక్ష అనుభవిస్తున్నట్లు డీఎస్పీ విశ్వనాథ్ వివరించారు.
తాజావార్తలు
-
Vivo S2: భారత్‌లో వివో S2 విడుదల.. 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 7,050mAh బ్యాటరీ, 50MP కెమెరా
-
Missing Meghana First Look: ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా తెలుగు సినిమా.. వి.వి. వినాయక్ చేతుల మీదుగా ‘మిస్సింగ్ మేఘన’ ఫస్ట్ లుక్ రిలీజ్
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్‌లు ఇదిగో..!
-
AIIMS: మరో రెండు ఎయిమ్స్‌లు మంజూరు చేయాలి.. కేంద్రానికి ఎంపీ లింగమనేని రమేశ్ విజ్ఞప్తి!
-
Hero Pleasure Plus: మరింత స్టైలిష్‌గా హీరో ప్లెజర్ ప్లస్.. కొత్త Aqua Grey కలర్లో విడుదల!
ట్రెండింగ్
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్‌తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!